NewsOrbit
న్యూస్

Karthika Deepam Feb 9 Today Episode: సౌందర్య మామూలుది కాదుగా.. రుద్రాణికి చుక్కలు చూపించిందిగా..?

Karthika Deepam Feb 9 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీక దీపం సీరియల్. రోజుకో మలుపు తిరుగుతూ భలే ఆసక్తిగా ముందుకు సాగుతూ పోతుంది.గత ఎపిసోడ్‌లో సౌందర్య ఎంట్రీతో రుద్రాణి గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. అలాగే దీపను కూడా ఏమి చేస్తున్నావో అర్ధం అవుతుందా అని అంటుంది.ఈ క్రమంలోనే రుద్రాణికి రైట్ అండ్ లెఫ్ట్ వాయించేస్తుంది సౌందర్య. ఈ రోజు ఎపిసోడ్ కూడా సరిగ్గా అదే సీన్ తో ఓపెన్ అవుతుంది. కార్తీక్ నా పెద్దకొడుకు. పెద్ద డాక్టర్.కోట్ల రూపాయలు దానం ఇచ్చి ఇక్కడికి వచ్చాడే నా కొడుకు కార్తీక్.వాడి ఒక్కరోజు సంపాదన నువ్వు ఒక్క సంవత్సరంలో కూడా సంపాదించలేవు అని ఎంతే నీ బాకీ? అంటూ రుద్రాణిపై అరుస్తుంది సౌందర్య. ‘మూడు లక్షల ఇరవైవేలు అంటుంది రుద్రాణి.

Singer Sunitha: సింగర్ సునీత ఎన్ని వేల పాటలు పాడిందో తెలిస్తే అవాక్కవుతారు?

Karthika Deepam Feb 9 Today Episode: హిమను తీసుకొచ్చిన రౌడీలు :

వెంటనే ‘పది లక్షల్లో ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా’ అంటూ చెక్ రాసి ముఖాన్న కొడుతుంది. దాన్ని చూసిన రుద్రాణి ‘పది లక్షలా? అని షాక్ అవుతుంది.ఇంతలో కారు వచ్చి ఆగగానే అందులోంచి హిమ దిగుతూనే సౌందర్యని చూసి ఏడుస్తూ నాన్నమ్మా అంటూ దగ్గరకు వెళ్లి మనం హైదరాబాద్ వెళ్లిపోదాం.. ఇక్కడేం బాలేదు’ అంటుంది. దాంతో సరేనమ్మా వెళ్ళిపోదాం అంటుంది సౌందర్య. ఇక అక్కడనుండి వెళ్లిపోతూ ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇల్లు చూసి వెళ్లు నువ్వేంటో నీ బతుకేంటో తెలుస్తుంది’ అంటుంది సౌందర్య రుద్రాణితో.

Singer Sunitha: సింగర్ సునీత ఎన్ని వేల పాటలు పాడిందో తెలిస్తే అవాక్కవుతారు?
కార్తీక్ కోసం మోనిత, భారతి వెతుకులాట:

మరోపక్క మోనిత తాడికొండ గ్రామంలో. ఎంటర్ అయ్యి కారు ‘భారతి ఈ తాడికొండలోనే నా కార్తీక్ ఉన్నాడని తెలిసి మనసు పొంగిపోతుంది తెలుసా అంటూ మురిసిపోతుంది. భారతి తలకొట్టుకుని.. ‘మోనితా ఇక వెళ్దామా అని అంటుంది భారతి. ఇంతకముందు ఒకసారి సౌందర్య ఆంటీ వాళ్లని ఫాలో అవుతూ ఈ గ్రామానికి వచ్చాను.. అప్పుడు కార్తీక్ కోసం వస్తున్నారేమో అనుకున్నా.. కానీ వాళ్లు ఆశ్రమంలో చేరానని తెలుసుకుని వెనక్కి వచ్చేశా’ అంటుంది మోనిత. ‘అవును నేనే వాళ్లని ఆశ్రమానికి రికమెండ్ చేసింది తెలుసా’ అంటుంది భారతి.

Sarkaru Vaari Paata: మహేష్ “సర్కారు వారి పాట” లాస్ట్ షెడ్యూల్ డీటెయిల్స్..!!
నాన్నమ్మ అంటూ సౌందర్యను కౌగలించుకున్న సౌర్య :

సీన్ కట్ చేస్తే మంచం మీద పడుకున్న సౌర్య ఏడుస్తూ ఉంటే.. పక్కింటామే ఓదారుస్తుంది. ఇంతలో హిమ పరుగున లోపలకి వచ్చి‘సౌర్య.. నేను రానేమో అనుకున్నా తెలుసా’ అంటూ ఏడుస్తుంది. ‘మరి ఎలా వచ్చావ్ హిమా అంటుంటే గుమ్మం దగ్గర ఉన్న సౌందర్యను చూసి ‘నాన్నమ్మా’ అనగానే.. సౌందర్య పరుగున సౌర్య దగ్గరకు వస్తుంది. ముద్దులు పెడుతుంది. సౌర్య ఆరోగ్య పరిస్థితి గురించి సౌందర్యకు చెప్పరు.ఇక సౌందర్య ఇళ్లంతా చూసి ఎలా ఉంటున్నార్రా ఈ ఇంట్లో అంటూ బాధపడుతుంది.నిద్ర లేచిన ఆనంద్ ను హిమ ఎత్తుకుని ఆడిస్తూ సౌందర్యకు అందిస్తుంది.వీడు ఎవడురా అంటే జరిగినది చెప్పి అలా వీడు మాకు దగ్గరయ్యాడు అంటాడు కార్తీక్.అప్పుడే సౌర్య.. ‘నాన్నమ్మ వీడి పేరేంటో తెలుసా’ అంటూ.. ఆనంద్ అంటుంది. దాంతో సౌందర్యకు మోనిత బాబు గుర్తొస్తాడు.

Deepti Sunaina : గృహప్రవేశం చేసిన షణ్ముఖ్.. షన్ను పక్కన వున్నది ఎవరబ్బా!
ఆనంద్ ను చూసి మోనిత కొడుకు అని సౌందర్య గుర్తుపడుతుందా.?

ఇక సౌందర్య ఆనంద్ ను ఎత్తుకుని ముద్దాడుతుంది.ఇక మోనిత, భారతిలు తిరిగి తాడికొండ గ్రామం పొలిమేరకు చేరుకొని అక్కడ కారు ఆపుతారు. మొత్తం వెతికాము ఎక్కడ కనిపించలేదు అనుకుంటారు.ఏంటో అందరూ దొరికినట్లే దొరికి చేజారిపోయారు అని బాధపడుతుంది మోనిత.చీకటి పడేసరికి సౌందర్య..కార్తీక్‌తో ‘పెద్దొడా మన ఇంటికి వెళ్లిపోదాంరా’ అంటుంది.కార్తీక్ మాత్రం ‘నేను రాలేను మమ్మీ అంటాడు. వీళ్ళ మాటలను దీప వింటూనే ఉంటుంది. ‘రాలేవా? ఏం సాధించావ్ రా ఇక్కడికి వచ్చి? అందరిని బాధ పెడుతున్నావ్ నువ్వు బాధపడుతున్నావ్ కదా.ఇక్కడ నువ్వు అక్కడ మేము బాధపడుతున్నాం’ అంటుంది సౌందర్య. ‘ఏంటి దీపా నువ్వేం మాట్లాడవేంటీ? అని పెద్దొడా నువ్వేం తప్పు చేశావనిరా తలదించుకుంటున్నావ్? నువ్వు ఒక గొప్ప డాక్టర్‌వి.. మాట్లాడరా? అని ఏడుస్తుంది సౌందర్య.

సౌందర్యతో ఇంటికి రాను అంటున్న కార్తీక్ :

మమ్మీ నేను రాలేను అంటాడు కార్తీక్. ఎందుకు రా..నువ్వు ఏ పాపం చెయ్యలేదురా.. ఏదో చిన్న పొరబాటు జరిగింది అంతే కదా’ అంటూ ఏడుస్తుంది సౌందర్య. ‘అది చిన్నది కాదు మమ్మీ. ఒక ప్రాణం విలువ అది.నేను ఇప్పుడు డాక్టర్ ను కాదు మమ్మీ. ఒకప్పుడు డాక్టర్‌నంతే..’ అంటాడు కార్తీక్. ‘నువ్వు డాక్టర్‌వి కాకుండా నా కొడుకువే కదా నాన్నా.. నిన్న కాక మొన్న కలిసిన బాబు మీద మీరు ప్రేమ పెంచుకున్నారే.. మరి కన్నకొడుకువి నీ మీద నాకు ఎంత ప్రేమ ఉంటుందో ఊహించలేవా నాన్నా’ అంటూ కార్తీక్ ను పట్టుకుని ఏడుస్తుంది సౌందర్య. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju