NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

మీ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా ..!

 

టోల్గేట్ దగ్గర ఎక్కువ సేపు వేచి ఉండకుండా వాహనానికి ఒక ఏర్పాటుచేసిన ఫాస్ట్ ట్యాగ్ నేరుగా కస్టమర్ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ చేస్తుంది.. ఈ నెల డిసెంబర్ 24న ఫాస్ట్ ద్వారా మొత్తం 80 కోట్ల టోల్గేట్ ఫీజులు వసూలైన సంగతి తెలిసిందే.. 2021 జనవరి 1 నుండి టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరికీ తెలిసినదే.. అయితే వచ్చిన చిక్కేమిటంటే ఫాస్ట్ ట్యాగ్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకునే పద్ధతి ఇప్పటి వరకు  లేదు..ఈ సమస్యను గుర్తించిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్ట్ ట్యాగ్ యాప్ లో కొత్త అప్డేట్ ను ప్రవేశపెట్టింది.. ఈ యాప్ ద్వారా బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు.. ఈ యాప్ ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు తమ ట్యాగ్ లో ఉన్న బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ముందుగా తమ స్మార్ట్ఫోన్లో “My FASTag app” యాప్ ను ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి.. అందులో మీ ట్యాగ్ వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాత యాప్ లో “check balance status” అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఫాస్ట్ ట్యాగ్ లో ఎంత బ్యాలెన్స్ ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు సులువుగా తమ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చని ఎన్ హెచ్ఏఐ తెలిపింది. మై ఫాస్ట్ ట్యాగ్ యాప్ లో కలర్స్ కోడ్ ఉంది. ఇందులో యాక్టివ్ గా ఉన్న ట్యాగ్ ను గ్రీన్ కలర్ ఇండికేట్ చేస్తుంది. ఈ కలర్ సేఫ్ సైడ్ ఇండికేషన్. బ్లాక్ లిస్ట్ చేయబడిన ట్యాగ్ను రెడ్ కలర్ ఇండికేట్ చేస్తుంది.రెడ్ కలర్ ఉంటే ఆ ట్యాగ్ టోల్ ప్లాజాల వద్ద పనిచేయవని యూజర్లు గుర్తించాలి. తక్కువ బ్యాలెన్స్ ఉన్న ట్యాగ్ను ఆరెంజ్ కలర్ ఇండికేట్ చేస్తుంది. ఆరెంజ్ లో కలర్ లో ఉన్నవారు వెంటనే రీఛార్జ్ చేసుకోవాలి. కరెంట్ పొజిషన్ తో పాటు బ్లాక్ లిస్ట్ చేసిన సమయాన్ని పది నిమిషాల నుండి మూడు నిమిషాలకు తగ్గించేలా అప్డేట్ చేశారు.

టోల్ ప్లాజా పాయింట్ ఆఫ్ సేల్ (పిఓఎస్) నుండి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ టాగ్ కోసం ఎన్ హెచ్ఏఐ దేశంలోని 26 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజా వద్ద 40,000 పైగా పిఓఎస్ లను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు యాప్ లో ఈ ఫీచర్ లేకపోవడం వల్ల యూజర్స్ టోల్ ప్లాజా ఆపరేటర్లకు ఇద్దరూ ఇబ్బందులు ఎదుర్కొనే వారు. దీని సాయంతో టోల్ ప్లాజా వద్ద ప్రయాణాలు సులువవుతాయని ఎన్ హెచ్ఏఐ భావిస్తోంది.

author avatar
bharani jella

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju