ఎప్పటినుండో అనుకుంటున్న ఈ విషయం ఇప్పటికి బయటపడింది. కొణిదెల వారసురాలు.. నిహారిక కొణిదెల ఈ సంవత్సరం పెళ్లి చేసుకోబోతోంది. ఇక తన కాబోయే భర్త ఎవరన్న విషయం ఇప్పటి వరకు తెలియదు కానీ తన పెళ్లి మాత్రం కుదిరిందని ఆమె తండ్రి నాగ బాబు స్వయంగా వెల్లడించారు. అయితే నిహారిక పెళ్లి పై వచ్చేవారం మెగా ఫ్యామిలీ నుండి అధికారిక ప్రకటన వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా ఇంస్టాగ్రామ్ లో నిహారిక కొణిదెల పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుంది. తన భర్తను తన బిగి కౌగిలిలో బంధించిన నిహారిక చిరునవ్వుతో ఫోటోకి ఫోజ్ ఇచ్చింది. అయితే పెళ్ళికొడుకు ముఖం మాత్రం కనిపించలేదు.
ఇక ఆ తర్వాత ఆనందంతో తేలియాడుతున్న నిహారిక…. ఇన్టాగ్రామ్ లో పెట్టిన మరొక పోస్టులో ప్రముఖ కాఫీ సంస్థ స్టార్ బక్స్ యొక్క కప్పు పైన ‘మిస్ నిహా’ అని రాసి ఉండగా…. అందులో ‘మిస్’ ను కొట్టేసి ‘మిస్సెస్ నిహా’ అని మార్చింది. ఈ కొనిదెల గారాలపట్టి… నిహారిక ఉత్సాహం చూసి మెగా వర్గాలు కూడా పెళ్లి సంబరాలు మొదలు పెట్టే యోచనలో ఉన్నారట.
మొత్తానికి మెగా వాకిట్లో పెండ్లి సందడి మొదలైపోగా…. వరుడు ఒక పెద్ద స్థాయిలో ఉన్న గవర్నమెంట్ అఫీషియల్ అని వార్తలు బయటకు వస్తున్నాయి. ఇక పెండ్లి కొడుకు సొంత ఊరు గుంటూరు అని సమాచారం.