Mahesh Babu Fashion: ప్రస్తుతం రౌడీ బ్రాండ్ వేర్ అంటే తెలియని వారు వుండరు. హైదరాబాద్ వీధుల్లో తిరిగే యూత్ సగటున 20 శాతం ఈ బట్టలు ధరిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. అంతలా ఈ బ్రాండ్ యూత్ లోకి దూసుకెళ్లింది. అయితే దీనికి ఏకైక కారణం విజయ్ దేవరకొండ అనే విషయం అందరికీ తెలిసినదే. “అర్జున్ రెడ్డి” ఏ ముహూర్తాన విడుదలయ్యిందో తెలీదుగానీ, అక్కడినుండి విజయ్ పట్టిందల్లా బంగారమౌతుంది. ఆ సినిమా తరువాత విజయ్, రెడీమేడ్ బ్రాండ్ వేర్ ‘రౌడీ’ పేరుతో లాంచ్ చేసి, సూపర్ హిట్ అయ్యాడు.
ఇంతకీ రౌడీకి పోటీ ఏవరు?
టాలీవుడ్ అందగాడు, సూపర్ స్టార్ మహేష్ బాబు.. సినిమాలతో పాటు పలు బిజినెస్ లు కూడా చేస్తూ ఉంటాడు. AMB సినిమాస్ మల్టీప్లెక్స్ & షాపింగ్ మాల్ గురించి అందరికీ తెలిసినదే. అలాగే అటు యాడ్స్ ద్వారా కూడా మహేష్ అత్యంత పారితోషికం తీసుకుంటున్న సంగతి తెలిసిన విషయమే. ఇపుడు థియేటర్స్ రంగంలోనే కాకుండా.. రెడీమేడ్ ఫ్యాషన్ రంగలోకి కూడా మహేష్ అడుగుపెడుతున్నారట. ఈ విషయం తెలిసిన రౌడీస్.. అదేనండి మన దేవరకొండ అభిమానులు ఒక్కసారిగా అవాక్కయారట.
ఈ విషయాన్ని బయటకి చెప్పింది ఎవరు?
సినీ ఆస్ట్రాలజర్ వేణు గోపాల స్వామి గురించి అందరికీ తెలిసినదే. స్వయంగా ఈయనే ‘సూపర్ స్టార్’ బ్రాండ్‌తో షర్ట్స్ మార్కెట్లోకి రాబోతున్నాయంటూ ఓపెన్ అయ్యారు. మహేష్ బాబు ఫ్యామిలీతో వేణుగోపాల్ కి మంచి సత్సంబంధాలు వున్నాయి. పద్మాలయ స్టుడియోస్ ఆస్థాన పూజారి ఈయన. మహేష్ బాబు సినిమాలకు ముహూర్తాలు ఈయనే పెడుతుంటారు. ఆ చనువుతో మహేష్ ఏపని తలపెట్టినా ఈయన్నే సంప్రదిస్తారట. ఈ క్రమంలోనే బట్టల వ్యాపారం మొదలు పెట్టడం కోసం.. ఈయన్ని ముహూర్తం కోసం పిలిచారని టాలీవుడ్లో వినికిడి.