money: మీకున్నా ఏ పని జరగాలన్న,డబ్బువృద్ది కావాలన్నా…  ప్రతి రోజు ఆ సమయన్నీ సద్వినియోగం చేసుకోండి!!

Share

money: కోపిష్టి
మీరు ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలనుకున్నప్పుడు శుక్ర  హోరలో ( Sukra Hora ) చేయడం వలన మంచి ఫలితం పొందుతారు. శుక్రవారం రోజు ఉన్న  శుక్రహోరలో అయితే ఎంతటి కఠిన  హృదయం అయినా కూడా  కరుణ,ప్రేమతో  నిండి ఉండే  సమయము గా చెప్పబడింది.ఎవరైనా కోపిష్టి అయినవాడు ,మూర్ఖుడు,కఠినుడు అయిన వ్యక్తిని కలవాలనుకుంటే మాత్రం  ఈ శుక్రహోర లో ఆ పని చేయండి.ఎందుకంటే ఆ సమయములో మీరు చెప్పిన విషయాన్ని అవతల వ్యక్తి సహనముతో విని  మీకు శాంతముగా సమాధానం ఇస్తారు.sd

money: శుక్ర హోర

శుక్ర హోరకు అథిపతి శుక్రుడు కాబట్టి శుక్ర వారము లేదా చంద్రుడు ( Moon ) భరణి,పూర్వ ఫల్గుణి,పూ ర్వాషాఢ నక్షత్రములలో ఉన్నప్పుడు  శుక్రహోరా సమయములో శుక్రుని ప్రభావము  చాల  ఎక్కువగా  ఉంటుంది.పెళ్ళి చూపులు జరపడానికి కూడా  శుక్రహోర సమయము చాల మంచి సమయం గా చెప్పబడింది.నగలు,పట్టు చీరలు,రత్నాలు, గంథము,గ్లాసు వస్తువులు ,సుగంథ ద్రవ్యములు,అలంకరణ  సామాగ్రి  కొనడానికి కూడా ఇది మంచి సమయము. వీటితో పాటు  విలాసవంతమైన వస్తువులు,వాహనము  కొనుగోలు చేయడానికి ,సినిమా థియేటర్లు,స్టూడియోలు,సంగీత కళాశాలలు, పాఠశాలలు, కళాశాలలు శుక్రవారము రోజు శుక్రహోరలో  ప్రారంబిఉంచడం అనేది శుభదాయకము గా చెప్పబడింది .తోళ్ళు,చర్మముతో కూడిన పరిశ్రమలు లేదా సంస్థలు,అనాథ సంక్షేమ గృహాలు  వంటివి  మొదలు పెట్టడానికి  శనివారం రోజు ఉండే శుక్రహోర చాలా అనుకూలం గా పనిచేస్తుంది. సోమవారం రోజు ఉండే  శుక్రహోర  లో మిల్క్ డైరీ ప్రారంభించడానికి చాలా   అనుకూలంగా చెప్పబడింది.  బియ్యము,ధాన్యము వంటి వ్యాపారానికి మంగళవారం రోజు ఉండే శుక్రహోర శుభసమయము గా ఉంటుంది.

సమస్త శుభకార్యాలకు

బుథవారం శుక్రహోర పట్టు,సిల్కుచీరలు,బిస్కట్లు,చాక్లెట్లు,పండ్లు,పూలు,కూరగాయలు, ,స్త్రీల అలంకరణసామగ్రి,మందుల వ్యాపారాలు ప్రారంభించుటకు, చాలా అనుకూలమైన, ఆనందకరమైన సమయము గా చెప్పబడింది.కోర్టు,తల్లీ పిల్లల హస్పిటల్, ఆదాయ పన్నుశాఖ, న్యాయము, పశువుల ఆసుపత్రి,వంటి వాటికి సంబంథించిన ఆఫీసులను ప్రారంభించటానికి లేదా  ఆ  శాఖలలో ఉద్యోగములో చేరడానికి గురువారము  రోజు ఉండే శుక్రహోర శుభ సమయము అని గుర్తు పెట్టుకోండి.అదే విధం గా సంబంధాలు నిశ్చయించడానికి, సంత కాలు పెట్టడానికి, ఔషధసేవకు, రైలు ప్రయాణానికి, నూతన వస్త్రాలు కట్టుకోవడనికి నిశ్చయ తాంబూలాలకు సమస్త శుభకార్యాలకు ఈ శుక్ర హోర మంచిది అని చెప్పబడింది.


Share

Related posts

గ్లాస్ వ‌స్తువుల‌పై క‌రోనా 28 రోజుల వ‌ర‌కు ఉంటుంది.. సైంటిస్టుల వెల్ల‌డి..

Srikanth A

సభలో అపశృతి: 10మందికి గాయాలు

somaraju sharma

ఆ నేత ఎంత లక్కీ అంటే సిఎం నుండే అభినందనల ఫోను వచ్చింది.

Yandamuri