Balakrishna : బాలకృష్ణ వరసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. చెప్పాలంటే యంగ్ హీరోలను మించి పోతున్నాడు బాలయ్య. ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో రెండు సినిమాలని లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బిబి 3 అన్న యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. మిరియాల రవీందర్ రెడ్డి ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తుండగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పూర్ణ మరొక కీలక పాత్రలో కనిపిస్తోంది.
అయితే ఈ సినిమా తర్వాత ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడన్న విషయం గత కొన్ని రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో బి.గోపాల్ తో ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పటికే బాలయ్య – బి.గోపాల్ కాంబినేషన్ లో సమర సింహరెడ్డి, నరసింహ నాయుడు లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి అలాంటి సినిమా ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోతోందని చెప్పుకున్నారు. ఆ తరువాత గోపీచంద్ మలినేని పేరు వార్తల్లో నిలిచింది. ‘క్రాక్’ సినిమా చూసిన బాలకృష్ణ .. గోపీచంద్ మలినేనిని పిలిచి మరీ అవకాశం ఇచ్చాడనే వార్తలు వచ్చాయి.
Balakrishna : బాలకృష్ణ ఏ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.
ఈ కాంబినేషన్ దాదాపు సెట్ అయిందని ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. మైత్రీ మూవీస్ లో ఈ సినిమా నిర్మాణం కాబోతోంది. కాగా ఇప్పుడు ఉప్పెన సినిమాతో సెన్షేషన్ హిట్ అందుకున్న బుచ్చిబాబు సానా కూడా బాలయ్య కోసం కథ సిద్దం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఎప్పటి నుంచో శ్రీవాస్ తో కూడా బాలకృష్ణ సినిమా చేస్తాడని అంటున్నారు. పూరి జగన్నాధ్, సంతోష్ శ్రీనివాస్, డైమండ్ రత్నబాబు కథ సినిమా ఉండబోతుందని సమాచారం. మరి బాలయ్య ఏ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.