NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు .. చర్లపల్లి జైలుకు తరలింపు

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు మరో సారి పోలీసులు అరెస్టు చేశారు. మహామ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడంపై ఎంఐఎం నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ పై పాత బస్తీలోని పలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు అందాయి. రాజాసింగ్ సు అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎంఐఎం నేతలు ఆందోళన చేసిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం డబీర్ పూర పోలీసులు ఆదరాబాదరగా అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హజరుపర్చారు. మెజిస్ట్రేట్ ముందుగా ఆయనకు 14 రోజులు రిమాండ్ విధింగా, రాజా సింగ్ తరపు న్యాయవాది పోలీసులు అరెస్టు సందర్భంలో 41 సీఆర్పీసి కింద నోటీసులు ఇవ్వలేదని మెజిస్ట్రేట్ కు విన్నవించారు. దీంతో ఎటువంటి షరతులు లేకుండానే మెజిస్ట్రేట్ విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులు ఆయనను ఇంటి వద్ద దించేశారు. దీంతో రాజాసింగ్ ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పాత బస్తీలో ఆందోళనలు చేశారు. పాత బస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘనటలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఎంఐఎం అధినేత అసద్దుద్దీన్ ఓవైసీ .. దీనిపై ఘాటుగా స్పందించారు. రాజాసింగ్ ను అరెస్టు చేసి జైలు కు తరలించాలని డిమాండ్ చేశారు.

 

ఈ నేపథ్యంలో ఈ రోజు మంగళ్ హాట్, షాహినాయక్ గంజ్ పోలీసులు రాజాసింగ్ ను ఆయన ఇంటి వద్దనే అదుపులోకి తీసుకుని నేరుగా నాంపల్లి కోర్టుకు తరలించారు. పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడంతో రాజాసింగ్ కు న్యాయమూర్తి జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు రాజా సింగ్ ను చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. రాజాసింగ్ అరెస్టు, కోర్టుకు తరలింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు భారీ బలగాలను మోహరించారు. మొన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా రాజాసింగ్ కు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చిన తర్వాత పోలీసులు ాయనను అదుపులోకి తీసుకున్నారు. తొలుత రాాజాసింగ్ ను రహస్య ప్రదేశానికి తరలిస్తున్నట్లుగా చెప్పిన పోలీసులు .. ఆ తరువాత వ్యూహం మార్చి నాంపల్లి కోర్టుకు తరలించారు.

ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు విషయంపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ ఆయనపై పీడీ యాక్ట్ నమోదు అయినట్లు తెలిపారు. చాలా సార్లు ఒక మతాన్ని, వర్గాన్ని కించపరిచేలా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని చెప్పారు. మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో గతంలో ఆయనపై రౌడీ షీట్ ఉన్నట్లుగా పేర్కొన్నారు. గతంలో ఉన్న పలు కేసుల ఆధారంగా చేసుకుని ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు చెప్పారు సీపీ ఆనంద్.

ఈ నెల 22న ఓ యూట్యూబ్ ఛానల్ లో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేశారని తెలిపారు. మహమ్మద్ ప్రవర్త కు వ్యతిరేకంగా అభ్యంతరకరంగా రాజాసింగ్ మాట్లాడారని సీపీ అనంద్ చెప్పారు. పోలీసుల విజ్ఞప్తి మేరకు యూట్యూబ్ నుండి ఈ వీడియో ను తొలగించారు. కాగా తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక ఎమ్మెల్యే పై పీడీ యాక్ట్ నమోదు అవ్వడం ఇదే తొలి సారి. పీడీ యాక్ట్ నమోదు చేయడం వల్ల దాదాపు ఏడాది పాటు బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. 2004 నుండి రాజాసింగ్ పై 101 కేసుుల నమోదు అయ్యాయి. ఇందులో 18 మతపరమైన కేసులు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి సరైన సాక్షాధారాలు లేక వీగిపోయాయి. మరి కొన్ని కోర్టు విచారణలో ఉన్నాయి.

ఎంఐఎం నేతల ఆందోళన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు

author avatar
sharma somaraju Content Editor

Related posts

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?