NewsOrbit
Entertainment News సినిమా

Posani Krishna Murali: పిలిచి మరి ఐదు లక్షలు అల్లు అర్జున్ ఇచ్చాడు…పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు..!!

Posani Krishna Murali: 2021 ఏడాదికి సంబంధించి “పుష్ప” సినిమాకి అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకోవటం తెలిసిందే. 69 ఏళ్ల భారతీయ చలనచిత్ర రంగంలో తెలుగు హీరోగా మొట్టమొదటిసారి ఉత్తమ జాతీయ అవార్డు బన్నీకి రావటం సంచలనం సృష్టించింది. దీంతో చాలామంది సినిమా ప్రముఖులు రాజకీయ నేతలు అల్లు అర్జున్ నీ అభినందించడం జరిగింది. తాజాగా ఏపీఎఫ్డిసి చైర్మన్ పోసాని కృష్ణ మురళి కూడా అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు రావడం పట్ల అభినందనలు తెలియజేశారు. తాజాగా తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన పోసాని.. అల్లు అర్జున్ తో తనకు మంచి స్నేహబంధం ఉందని పేర్కొన్నారు. బన్నీ ఎప్పటి నుంచో నాకు మంచి ఫ్రెండ్. నేను సీనియర్ నే అయినా నేనంటే అల్లు అర్జున్ ఎంతో ఇష్టపడతాడు.

Allu Arjun called and gave another five lakh Krishna Murali's sensational comments

ఒకసారి నాకు ఫోన్ చేసి మురళి గారు ఒకసారి మా ఇంటికి వస్తారా… టీ తాగి వెల్దురు గాని అన్నారు. వెళ్లాను.. టీ ఇస్తే తాగుతున్నా.. లోపల నుంచి ఒక ఎనవలప్ కవర్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. ఏంటి బాబూ ఇదీ అంటే.. తీసి చూడండి అన్నాడు. తీసి చూస్తే రూ.5 లక్షల చెక్ ఉంది. ఏంటి బాబూ నాకు చెక్ ఇచ్చావ్ అని అడిగాను. ఉంచండి మీ దగ్గర అన్నాడు. బాబూ నేను బాగున్నాను కదా.. వెల్ సెటిల్డ్ కదా.. నాకెందుకు ఇస్తున్నావ్ అన్నాను. మీరు డబ్బులు ప్రాపర్‌గా యూజ్ చేస్తారు సార్.. వృథా చేయరు.. సద్వినియోగం చేస్తారు.. అది నాకు బాగా నచ్చింది.. చాలా మందికి గుండె ఆపరేషన్లు చేయించారు.. మీరు చేసినట్టు కూడా చాలా మందికి తెలీదు.. ఈ రూ.5 లక్షలు కూడా మంచి పనికి వాడతారు.. దయచేసి తీసుకోను అనొద్దు ప్లీజ్.. అని నాకు ఇచ్చాడు’ అని పోసాని కృష్ణ మురళి చెప్పుకొచ్చారు. అయితే ఆ చెక్కు తీసుకొని కటిక పేదరికంలో పదో తరగతిలో మంచి మెరిట్ మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసుకుని.. ప్రముఖ న్యూస్ ఛానల్ లోకి లైవ్ లోకి పిలిపించాను.

Allu Arjun called and gave another five lakh Krishna Murali's sensational comments

ఆ పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఈ క్రమంలో సదరు విద్యార్థుల చదువుకు సంబంధించి డిగ్రీ వరకు ఎంత ఖర్చవుతుంది అని అడిగాను. వాళ్లు లక్ష నుంచి లక్షన్నర రూపాయలు అవుతుందని అన్నారు. వెంటనే వాళ్ళ ముగ్గురికి చెక్కులు ఇచ్చాను. అదనంగా మరో 10 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో వాళ్లు నాకు ధన్యవాదాలు చెప్పారు. ఆ సమయంలో ఓ అమ్మాయి కంటతడి పెట్టుకుంది. అయితే ఈ సాయం నేను చేయలేదు అల్లు అర్జున్ చేశారు ఆయనకు ధన్యవాదాలు చెప్పండి అని లైవ్ లోనే చెప్పించా.. అని పోసాని అప్పటి విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత బన్నీ తనని మళ్లీ ఇంటికి పిలిపించుకుని ఎలా చేశారంటే అని అన్నారు. వెంటనే ఏమయ్యా సొమ్ము నీది సోకు వేరే వారితో ఎలా. నువ్వు చెక్ ఇస్తే నేను సాయం చేసినట్టు.. నేను చాలా గొప్పది అనిపించుకోవడం నాకు మేము కూడా పడదు అందుకే నీ పేరు చెప్పేశా.. అన్ని బన్నీతో అన్నట్లు పోసాని మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu