Bobby Deol: గత ఏడాది విడుదలైన సినిమాలలో “యానిమల్” సినిమా అతిపెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన “యానిమల్” బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాలో బాబి డియోల్ విలన్ పాత్రలో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా బాబీ డియోల్ కెరీర్ కి కొత్త ప్రారంభాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమా ఎంత హిట్ అయిందో అదే రీతిలో బాబీ డియోల్ కి అదే స్థాయిలో పేరు వచ్చింది.
ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నట్లు తాజాగా సినిమా యూనిట్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. నేడు బాబి డియోల్ బర్త్ డే సందర్భంగా విషెస్ తెలియజేయడం జరిగింది. అంతేకాదు స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’ లో కూడా విల్లన్ పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. చారిత్రక నేపథ్యంతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శివ రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో తెరకెక్కుతున్న ‘కంగువ’ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా బాబీ డియోల్ బర్త్ డే సందర్భంగా ‘కంగువ’ సినిమా నుంచి ఆయన క్యారెక్టర్ ఉధిరన్ లుక్ రిలీజ్ చేసి బర్త్ డే విషేస్ తెలియజేశారు. ‘కంగువ’ లో బాబీ డియోల్ లుక్ యానిమల్ సినిమాలో కంటే మరింత పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటీనటులు సౌత్ సినిమాలలో విలన్ పాత్రలు చేస్తూ ఉన్నారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్ ఇలా.. కొంతమంది నటీనటులు నెగిటివ్ పాత్రలు చేస్తూ మెపిస్తున్నారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!