Naga Chaitanya: టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ బ్యూటీ కపుల్ ఎవరైనా ఉన్నారా అంటే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది సమంత మరియు నాగచైతన్య. వీరిద్దరూ కలిసి ఉన్నది కొంతకాలమే అయినా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు.
కొంతకాలం పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరిద్దరూ ఎవరి దిష్టి తగిలిందో తెలియదు కానీ అనంతరం విడిపోయారు. ఆరేళ్లుగా ప్రేమించుకున్న వీరి ప్రేమ సంవత్సర కాలం పాటు కూడా నిలవలేకపోయింది. చాలాకాలం ప్రేమలో ఉన్న వీరిద్దరూ 2017 లో వివాహం చేసుకుని ఒకటయ్యారు. అనంతరం కొన్ని సినిమాల్లో నటించి ఈ జంటకు ప్రత్యేకమైన క్రేజ్ ని కూడా సంపాదించుకున్నారు.
ఇక ఒకసారి ఒక్కసారిగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఇక వీరిద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ వీరిద్దరిని ఏదోరకంగా కలిపేందుకు అనేక పుకార్లు పుట్టిస్తూ ట్రై చేస్తున్నారు తమ అభిమానులు. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియోని కూడా క్రియేట్ చేశారు.
2024 వాలెంటైన్స్ డే నాడు చైతన్య సాయి పల్లవిని ట్యాగ్ చేస్తూ..” బుజ్జి తల్లి వచ్చేస్తున్నా కదే “అనే డైలాగ్ ని పెట్టి షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ వీడియోకి సాయి పల్లవి ప్లేస్ లో సమంతని యాడ్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు సమంత ఫ్యాన్స్. అదేవిధంగా ఈ వీడియోని చూసిన కొందరు.. ఇది కనుక నిజం అయితే ప్రతి ఒక్కరు హ్యాపీ. నిజంగా ఈ వీడియోని చూస్తుంటే క్రియేట్ చేసిన వాడికి దండం పెట్టొచ్చు అనిపిస్తుంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!