NewsOrbit
సినిమా

K.Raghavendra Rao: తన కెరీర్లో దర్శకేంద్రుడి పాత్ర ఎంతో చెప్పిన చిరంజీవి

chiranjeevi about k.raghavendra rao

K.Raghavendra Rao: కె.రాఘవేంద్రరావు, బి.ఏ.. K.Raghavendra Rao అనే పేరు తెలుగు సినిమాపై ఓ చెరగని సంతకం. తెలుగు సినిమా చరిత్రలో ఉద్దండులు అని వేళ్ల మీద లెక్కపెట్టగలిగే దర్శకుల్లో ఆయన ఒకరు. తెలుగు సినిమాను కమర్షియల్ రేంజ్ ను మొదటిసారిగా నిరూపించింది దర్శకేంద్రుడే. పాటల్లో హీరోయిన్ల అందాన్ని ఇంత అందంగా ప్రెజెంట్ చేయొచ్చని.. పాటల్లో పూలు, పండ్లు ఉపయోగించి పాటలను అందంగా మార్చేయొచ్చని నిరూపించింది కూడా రాఘవేంద్రరావే. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తెలుగు సినిమాను కమర్షియల్ రేంజ్ లో శాసించిన మెగాస్టార్ చిరంజీవి ఆయన పుట్టినరోజునాడు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పడమే కాదు.. తన ఎదుగుదలలో రాఘవేంద్రరావు ప్రత్యేకత ఎంతో గుర్తు చేసుకున్నారు.

chiranjeevi about k.raghavendra rao
chiranjeevi about k.raghavendra rao

‘రాఘవేంద్రరావు  సినీ ప్రస్థానంలో అత్యధిక చిత్రాల కథానాయకుడిగా నాకు ఓ ప్రత్యేకత లభించింది. ఆ రకంగా మా కాంబినేషన్ ఎంతో స్పెషల్. నా స్టార్ డంని, కమర్షియల్ స్థాయిని పెంచిన దర్శకుడు, తెలుగు చిత్రాల్లో ఎప్పటికీ అపురూపంగా నిలిచే జగదేకవీరుడు.. అతిలోకసుందరి లాంటి చిత్రాన్ని నాకు కానుకగా ఇచ్చిన దర్శకేంద్రుడు శ్రీ రాఘవేంద్రరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్ధిస్తున్నాను’ అని ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి కెరీర్లోనే కాదు.. తెలుగు సినిమా క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచే జగదేకవీరుడు అతిలోక సుందరి, తెలుగు సినిమా తొలిసారి 10కోట్ల షేర్ చూసిన ఘరానామొగుడు వీరి కాంబినేషన్లోనే వచ్చాయి.

ఇంకా అడవిదొంగ, మంచి దొంగ, రుద్రనేత్ర, కొండవీటి రాజా, చాణక్య శపథం, యుద్ధభూమి, రౌడీ అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, శ్రీ మంజునాధ, ఇద్దరు మిత్రులు.. వంటి సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. రాఘవేంద్రరావు తన సినిమాల్లో ఎన్టీఆర్ తో అడవిరాముడు కమర్షియల్ సక్సెస్ లో కొత్త పుంతలు తొక్కించారు. వెంకటేశ్ తొలి సినిమా కలియుగ పాండవులు, నాగార్జునతో అన్నమయ్య, శ్రీరామదాసు, బాలకృష్ణతో అశ్వమేధం, ఎన్టీఆర్-మోహన్ బాబు కాంబోలో మేజర్ చంద్రకాంత్, శ్రీకాంత్ తో పెళ్లిసందడి వంటి సినిమాలు తెరకెక్కించారు. ఇవి కాకుండా ఎందరో హీరోలతో భారీ కమర్షియల్ హిట్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ‘పెళ్లిసందడి’ సినిమా తెరకెక్కిస్తున్నారు.

 

 

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu