Ram Charan: మార్చి 27వ తారీకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కూతురు పుట్టిన తర్వాత వచ్చిన పుట్టినరోజు నేపద్యంలో.. ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ఈ క్రమంలో హైదరాబాదులో రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. దర్శకులు బాబి, బుచ్చిబాబుతో పాటు హీరోలు నిఖిల్, కిరణ్ అబ్బవరం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అదేవిధంగా మరో టాప్ నిర్మాత దిల్ రాజు ఇంకా చాలామంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు “RC16” గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఏది మొదలుపెట్టినా చిరంజీవి గారి దగ్గరనుంచి మొదలు పెట్టాలి. నా మొదటి సినిమా ఉప్పెన ఆయనే కన్ఫామ్ చేశారు. చిరంజీవి గారు లేకపోతే నా ఈ ప్రయాణం లేదు. ఏదో మాట్లాడాలని వచ్చాను… మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయింది . రామ్ చరణ్ సార్ మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు నాకు ఇచ్చినా అవకాశాన్ని మనస్ఫూర్తిగా నిరూపించుకుంటాను. ఈ క్రమంలో చేయబోయే సినిమా గురించి యాంకర్ ప్రశ్నించడం జరిగింది. దీంతో బుచ్చిబాబు ఆల్రెడీ మూడు పాటలు కంప్లీట్ అయినట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం అందించారని పేర్కొన్నారు.
“ఉప్పెన” సినిమాకి దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతమందించారు. ఆ పాటలకు మించి “ఆర్సి16” సాంగులు ఉంటాయని స్పష్టం చేశారు. ఏఆర్ రెహమాన్ అద్భుతమైన పాటలు… రోజు వింటూనే ఉన్నాను అంటూ.. బుచ్చిబాబు కామెంట్లు చేశారు. కాగా కొద్ది రోజుల క్రితమే ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. RC16లో రామ్ చరణ్ సరసన జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సినిమా స్టోరీ ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, బోణీ కపూర్, డైరెక్టర్ శంకర్, సుకుమార్, ఏఆర్ రెహమాన్ ఇంకా చాలామంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సినిమాలో చరణ్ ని దర్శకుడు బుచ్చిబాబు చాలా వైవిధ్యంగా చూపించబోతున్నట్లు సమాచారం.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!