Nani- Tuckjagadish: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాణం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఒక్కొక్కటి వాయిదా పడుతూ వస్తున్నాయి. ఏప్రిల్ 16న విడుదల కావాల్సిన నాగచైతన్య “లవ్ స్టోరీ”సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన “టక్ జగదీష్” సినిమా కూడా వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ షైన్స్క్రీన్స్ ట్విటర్ వేదికగా వెల్లడించింది.
ప్రస్తుతం ఉన్న కారణాలవల్ల “టక్ జగదీష్” చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం.ఈ సినిమా తదుపరి విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఉన్నపళంగా విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాను వాయిదా వేయడానికి గల కారణాన్ని చిత్రబృందం తెలియజేయలేదు.తాజాగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చిత్రబృందం ఈ విధమైన నిర్ణయం తీసుకుందా లేక మరేమైనా కారణాలున్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది.
నాచురల్ స్టార్ నాని, రీతూ వర్మ:
నాని, రీతు వర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శివ నిర్వాణ దర్శకత్వం వహించగా షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకొని ఈ నెల ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇదివరకే చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో సందడి చేయనున్నారు. ఇది వరకే నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన “నిన్ను కోరి” చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం సమకూర్చారు. ఈ విధంగా విడుదలకు సిద్ధంగా ఉన్న ఒక్కో సినిమాను వాయిదా వేస్తూ ఉండడంతో కొంత వరకు అభిమానులు నిరాశ చెందుతున్నారు.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!