Karthika deepam: వెండి తెర పైనే కాదు బుల్లితెరపై ప్రసారమయ్యే వాటికి కూడా ఎంతోమంది అభిమానులు ఉంటారు. ఈ విషయాన్ని కార్తీకదీపం సీరియల్ ద్వారా నిరూపించారు. ఒకప్పుడు సీరియల్స్ అంటే టైంపాస్ కింద తీసుకునే వారంతా కార్తీకదీపం సీరియల్ కి ఫుల్ ఎడిట్ అయిపోయారు. ఆ సీరియల్ లో వారు కంటతడి పెడితే చూసే ప్రేక్షకులు కూడా కంటతడి పెట్టేవారు.
అంతలాగా ఆకట్టుకుంది మరి కార్తీకదీపం సీరియల్. ఇక ఆ సీరియల్ లో వంటలక్క పాత్రకు ఎంతోమంది ఫాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క పాత్రను పోషించిన ప్రేమి విశ్వనాథ్ కి హ్యాట్సాఫ్ చెప్పవచ్చు. తన కట్టుబొట్టు మార్చి ఎక్కడో చెన్నై నుంచి వచ్చి ఇక్కడ సీరియల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమాలో డాక్టర్ బాబు పాత్రకి పూర్తి న్యాయం చేసిన నిరూపం మనందరికీ సుపరిచితమే.
ఈయన తెలుగు వాడే కావడంతో మనందరికీ పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇక ఈ సీరియల్ లో మెయిన్ లేడీ కిల్లర్‌గా నటించిన మౌనిత అలియాస్ శోభా శెట్టి సైతం మనందరికీ సుపరిచితమే. ఇక ఈమె ఇటీవల బిగ్ బాస్ సీజన్ లో పాల్గొని రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా రియల్ మౌనిత అనే బిరుదుని సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం కార్తీకదీపం కి సీక్వెల్ గా కార్తీకదీపం 2 వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సీక్వెల్ నుంచి ప్రోమో రిలీజ్ అయింది.
ఇక తాజాగా మరో ప్రోమో ని రిలీజ్ చేశారు ఈ సీరియల్ టీం. ఇక ఇందులో సరికొత్త నేపథ్యంలో ఈ సీరియల్ రానున్నట్లు తెలుస్తుంది. నిరుపం అనగా డాక్టర్ బాబు దగ్గర పని చేస్తున్న వంటలక్క తన కూతురు శౌర్య ని ఈ ప్రోమోలో చూపించారు. తండ్రిని వెతికే క్రమంలో శౌర్య ఉంటే తండ్రి అతనే అని చెప్పలేని స్థితిలో వంటలక్క కనిపించింది. దీంతో ఈ ప్రోమో చూసిన పలువురు.. ఇది కార్తీకదీపంనే మించిపోయేటట్టు ఉంది. మౌనిత ఎంట్రీ కోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Karthika Deepam – Promo | New Serial | StarMaaSerials | Coming Soon only on Star Maa.#StarMaaSerials #StarMaa#KarthikaDeepam pic.twitter.com/L9FbrqAQxB
— Starmaa (@StarMaa) February 25, 2024
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!