Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా పుష్ప సినిమాలో ఊ అంటావా.. మామ ఊఊ అంటావా.. అంటూ ఐటమ్ సాంగ్ తో అదరగొట్టింది. ప్రస్తుతం ‘శాకుంతలం’, ‘యశోద’ చిత్రాలతో బిజీగా ఉన్న సమంత, నయనతారతో కలిసి ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ అనే ఒక తమిళ చిత్రంలోనూ నటిస్తోంది. శాకుంతలం ఒక దృశ్యకావ్యంగా పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకులను పలకరించనుండగా… ఇక ‘యశోద’ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతుంది.
AP Wine Shops: ఏపిలో మందు బాబులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..
Samantha: వరుణ్ ధావన్ తో సామ్ జోడీ..
తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు ఇక బాలీవుడ్ లోనూ తన సత్తా చాటడానికి సమంత రెడీ అవుతుంది. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా చేస్తున్న ‘సిటాడెల్’ను ఇండియాలోను.. ఇటలీలోను రీజినల్ వెర్షన్స్ లో తీయబోతున్నారు. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్‌ధావన్ తో కలిసి ఆమె ‘సిటాడెల్’ అనే ఓ సిరీస్‌లో నటించనుందని సమాచారం. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించనున్న ఈ వెబ్ సిరీస్ యాక్షన్ ప్రధానంగా నడుస్తుందట. ఇక హాలీవుడ్లో ‘అవెంజర్స్’ లాంటి సూపర్ హీరో చిత్రాలకు రూపొందించిన రుసో బ్రదర్స్ ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మిస్తుండడం విశేషం.
Puri Jagannadh: బ్యాంకాక్ బీచ్ లో ఆ పని అస్సలు చేయలేం.. సీక్రెట్ రివిల్ చేసిన పూరి!
స్పై ఏజంట్ గా సమంత..!
కాగా ‘సిటాడెల్’ సిరీస్‌లో వరుణ్, సమంతలు స్పై ఏజెంట్లుగా నటించనున్నారు. అందువలన ఈ సిరీస్ లోని ఆమె పాత్రకి న్యాయం చేయడానికి ఆమె గంటల తరబడి వర్కౌట్స్ చేస్తోందని సమాచారం. వచ్చే ఏడాది ఈ సిరీస్ పట్టాలెక్కనుంది. అయితే సెట్స్‌పైకి వెళ్లేముందే వరుణ్, సమంతలు ఓ వర్క్‌షాపులో పాల్గొననున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నారు. వీటితో పాటు ఓ అంతర్జాతీయ చిత్రంలో నటించేందుకు సామ్ అంగీకరించిందని సమాచారం.