సూపర్ స్టార్ మహేశ్ బాబు 25వ సినిమా, ముగ్గురు బడా నిర్మాతలు కలిసి ముందుండి నడిపిస్తున్న సినిమా… అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 5న మహర్షి సినిమా ముందెన్నడూ చూడని కలెక్షన్ల సునామి సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేశారు, కానీ ఇప్పుడు షూటింగ్ డిలే అవ్వడంతో పరిస్థితి తలకిందులయ్యింది. మహర్షి ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్ అవుతుందని కాదు కాదు జూన్ ఫస్ట్ వీక్ లోనే వస్తుందని ఇంకొకరు. ఇలా ఎవరికి తోచిన డేట్ వారు చెప్తూ ఘట్టమనేని అభిమానులని తికమక పెడుతున్నారు.
మహర్షి రిలీజ్ డేట్ పక్కాగా తెలియక పోయినా కూడా ఏప్రిల్ 5న రావట్లేదు అనే మాట మాత్రం వాస్తవం, ఇప్పటికే నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు. కారణాలేవైనా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న మహర్షి సినిమా ఆలస్యం కాబోతుండడం ఘట్టమనేని అభిమానులని నిరాశ పరిచింది. ఇప్పుడు వీరిని సంతోష పరచడానికి మహేశ్ బాబు, శివరాత్రి కానుకగా మహర్షి సినిమా నుంచి ఒక సర్ప్రైస్ అప్డేట్ ఇవ్వబోతున్నాడు.
మహాశివరాత్రి నాడు విడుదల చేయబోతున్న సర్ప్రైస్ లో సినిమా కాన్సెప్ట్ అర్థమయ్యేలా ఒక స్పెషల్ టీజర్ ను కట్ ఇందులోనే మహేశ్ బాబు మూడు గెటప్స్ కి సంబందించిన లుక్స్ కూడా రివీల్ చేయబోతున్నారట. మరి బెంచ్ మార్క్ సినిమాలో మహేశ్ బాబు ఎలా ఉంటాడో తెలియాలి అంటే మహాశివరాత్రి వరకూ ఆగాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!