Samantha: నాగ చైతన్య-సమంతల విడాకులు తీసుకుని రెండేళ్లు పూర్తయ్యాయి. వారి విడిపోవడానికి అసలు కారణం ఇంకా తెలియరాలేదు. 2017లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఇండస్ట్రీలోనే చూడ ముచ్చటగా ఉండేది. కానీ పెళ్లి చేసుకున్నాక నాలుగు సంవత్సరాలకే సమంత-నాగ చైతన్య ఎందుకు విడిపోయారు అనేది ఇప్పటికి సస్పెన్స్ గానే ఉంది. అక్టోబర్ 2021లో..సరిగ్గా కరోనా టైములో ఈ జంట తమ విడాకులను అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి అనేక పుకార్లు, ఊహాగానాలు వెలువడ్డాయి. ముఖ్యంగా సమంతను టార్గెట్ చేశారు. ఒక వెర్షన్ ప్రకారం, సమంత పెళ్లి తర్వాత కూడా బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి ఇష్టపడని నాగ చైతన్య ఆమెతో విడాకులు తీసుకున్నాడు అని అన్నారు. దానికి తోడు సమంతకి పిల్లలు కన్నడం ఇష్టం లేదు. ఆమె తన వ్యక్తిగత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్‌తో ఎఫైర్ నడుపుతున్నట్లు ఇలా వార్తలు వచ్చాయి.
దీంతో నిరాధారమైన వార్తల ఆధారంగా సమంత కొన్ని మీడియా సంస్థలు మరియు యూట్యూబ్ ఛానెల్‌లపై కేసు వేసింది… కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో సంబంధిత ఛానెల్‌ల కంటెంట్ కోర్టు ఆర్డర్ ద్వారా తొలగించబడింది. ఇదే సమయంలో సమంత డిప్రెషన్‌కు గురైంది. విడాకుల ఒత్తిడి నుంచి బయటపడేందుకు సమంత స్నేహితులతో సమయం గడుపుతూ…ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించారు. విడాకుల తర్వాత సమంత యశోద, శాకుంతలం, ఖుషి వంటి చిత్రాల్లో నటించింది. అనంతరం సిటాడెల్ అనే సినిమా చేయడం జరిగింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ వెబ్ సిరీస్ త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇంతలో సమంత విడాకుల మ్యాటర్ తెరపైకి రావడం జరిగింది.
సమంత విడాకుల నిర్ణయం వెనుక అమ్మాయి హస్తం ఉందనే అనుమానాలు మళ్లీ తలెత్తుతున్నాయి. దీనికి కారణం సోషల్ నెట్‌వర్క్‌లో సమంత చేసిన పోస్ట్. మలేషియాకు చెందిన మేఘన అనే తన స్నేహితురాలితో కలిసి దిగిన ఫోటోను సమంత రీసెంట్ గా షేర్ చేసింది. ఈ ఫోటోపై సమంత ఆసక్తికర కామెంట్‌ని జోడించింది. “నా విలువైన ప్రేమికుడికి ముఖం ఉంటే.. అది మేఘే” అని సమంత సంచలన కామెంట్స్ చేసింది. మేఘన తన జీవితంలో ఎంత ముఖ్యమో పంచుకుంది. ఐతే సమంత నుంచి విడాకుల విషయంలో మేఘనా సూచనలు, ప్రతిపాదనలు కచ్చితంగా కరెక్ట్‌గా ఉంటాయి. మేఘన అనుమతితోనే సమంత విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!