Trisha: హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాల నుండి చలనచిత్ర రంగంలో విజయవంతంగా రాణిస్తూ ఉంది. తమిళ ఇండస్ట్రీకి చెందిన త్రిష వయసు 40కి పైగానే..ఉంది. స్టార్ హీరోయిన్ గా 2000 సంవత్సరం తర్వాత దాదాపు దశాబ్దం నర ఒక ఊపు ఊపింది. దక్షిణాది చలనచిత్ర రంగంలో దాదాపు స్టార్ హీరోలు అందరి సరసనను నటించింది. తెలుగులో “వర్షం” సినిమాతో మొదటి విజయం అందుకుంది. హీరో ప్రభాస్ కి కూడా “వర్షం” మొదటి హిట్ సినిమా. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, నితిన్, రవితేజ, ఇంకా చాలామంది హీరోలతో నటించింది.
త్రిష టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో చలామణి అవుతున్న సమయంలోనే ఇలియానాకి కూడా మంచి హిట్లు పడ్డాయి. దీంతో వెంటనే సౌత్ ఇండియా నుండి బాలీవుడ్ కి మకాం మార్చేసింది. కానీ అక్కడ మొదటి అవకాశాలు వచ్చిన తర్వాత తొక్కేశారు. దీంతో యధావిధిగా మళ్లీ సౌత్ సినిమాలు చేయటానికి పూనుకున్న ఇలియానాకి పెద్దగా అవకాశాలు రాలేదు. ఇదే రీతిలో కాజల్ అగర్వాల్ కూడా దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న సమయంలో బాలీవుడ్ లో దుకాణం పెట్టింది. ప్రారంభంలో అవకాశాలు వచ్చాయి. కానీ ఏ సినిమా కూడా పెద్దగా ఆడకపోవటంతో.. ఉత్తరాది వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. దీంతో లైఫ్ ఇచ్చిన దక్షిణాదిలోకి రీఎంట్రీ ఇచ్చి అవకాశాలు అందుకుంది.
ఇదిలా ఉంటే దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న త్రిష తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వెళ్లకపోవడానికి గల కారణం చెప్పింది. హిందీ సినిమాలు చేయకపోవటానికి కారణం తన ఫ్యామిలీ అని పేర్కొంది. తన కుటుంబాన్ని ముంబైకి షిఫ్ట్ చేయడం తనకి ఇష్టం లేదని తెలిపింది. ప్రధానంగా బాలీవుడ్ లోకి వెళ్తే దక్షిణాది సినిమాలను వదులుకోవాల్సి వస్తది. సౌత్ లో నాకున్న పాపులారిటీ బట్టి బాలీవుడ్ లైట్ తీసుకున్న.. అని త్రిష తెలియజేయడం జరిగింది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!