Varun tej: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం చెప్పుకోవాల్సిన పనిలేదు. తెలుగునాట ఏ చిన్న పిల్లాణ్ణి అడిగినా చెబుతాడు.. అంతటి జనాదరణ వున్న సినిమా హీరో మరొకరు ఇక్కడ లేరనే చెప్పుకోవాలి. ఇక పవన్ సినిమా వస్తుందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. థియేటర్లు ఫ్లెక్సీలతో నిండిపోయి కనబడతాయి. పవన్ తాజా సినిమా ఈ నెల 25న రిలీజ్ కావడంతో టాలీవుడ్లో అనేక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
Bigg Boss Telugu OTT: ఓటీటీ బిగ్‌బాస్‌కి సర్వం సిద్ధం.. కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ ఇదే..!
Varun tej: వరుణ్ తేజ్ సినిమా విశేషాలు:
ఇకపోతే ఈ నెల 25న రావాల్సిన వరుణ్ తేజ్ నటించిన ‘గని’ సినిమా, బాబాయ్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా రావడంతో వెనక్కి వెళ్ళింది. అయితే ముందు ఈ సినిమా దర్శక నిర్మాతలు, ఫిబ్రవరి 25 లేదంటే మార్చి 4న తమ చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పకనే చెప్పారు. అయితే ఈ క్రమంలోనే ఈ నెల 25న రావాల్సిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు, సెబాస్టియన్’ చిత్రాలు కూడా మార్చి 4కు పోస్ట్ అవ్వడం కొసమెరుపు.
Diabetes: మధుమేహన్ని తరిమిగొట్టడం చాలా సింపుల్ ఇలా చేస్తే..!!
వరుణ్ మాట:
తాజాగా ఈ చిత్ర నిర్మాతలు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. టఫ్ టైమ్ లో తమకు బాసటగా నిలిచిన వారందరీ ప్రేమకు ఎంతో సంతోషిస్తున్నామని, ‘భీమ్లా నాయక్’ 25న రాబోతున్నందువల్ల తమ చిత్రం విడుదలను వాయిదా వేసుకున్నామని, కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాని తెలిపారు. ఈ నేపథ్యంలో వరుణ్ మాట్లాడుతూ.. బాబాయ్ సినిమా కోసం వెనక్కి తగ్గమంటూ తెలియజేసాడు. అలాగే అభిమానుల మాదిరిగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఎప్పుడెప్పుడు వెండితెర మీద చూస్తామా! అని తామూ అంతే ఉత్సుకతతో ఎదురు చూస్తున్నట్టు ‘గని’ చిత్ర యూనిట్ చెప్పడం కొసమెరుపు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!