రానా లేని `విరాటపర్వం` కొనసాగుతోంది. ఎందుకంటే రానా ఊళ్లో లేడు కాబట్టి. ప్రస్తుతం యు.ఎస్.లో ఉన్నాడు కాబట్టి. సెప్టెంబర్ వరకు రాడు కాబట్టి. సో సెప్టెంబర్ దాకా `విరాటపర్వం`లో ఏం జరిగినా రానా లేకుండానే. ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకుడు. `నీదీ నాదీ ఒకే కథ`తో ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యారు వేణు. ఇప్పుడు తన రెండో సినిమాగా రానా, సాయి పల్లవి జంటగా ఆయన ఓ సినిమా చేస్తున్నారు. అదే `విరాటపర్వం`. ఈ చిత్రంలో టబు, ప్రియమణి తదితర తారాగణం బలంగానే ఉండనుంది. ఇటీవల ఓపెనింగ్ కూడా గుట్టుగా చేసుకుంది. అయితే ఇప్పుడు షెడ్యూల్స్ జరగాల్సినప్పుడు మాత్రం రానా ఊళ్లో లేడు. సెప్టెంబర్ వరకు తాను షూటింగ్లో పాల్గొనలేనని, అప్పటిలోపు తాను లేకుండా జరగాల్సిన మిగిలిన అంశాలన్నీ షూటింగ్ చేసేయాలని రానా చిత్ర యూనిట్‌ను కోరినట్టు సమాచారం. సో వచ్చేనెల వరకు మిగిలిన మొత్తంపోర్షన్ని పూర్తి చేస్తారన్నమాట వేణు. అయితే దీని గురించి చిత్ర యూనిట్ ఇప్పటిదాకా నోరు విప్పలేదు. మరోవైపు రానా ఆరోగ్యం గురించి వస్తున్న వార్తల పట్ల ఆయన కుటుంబసభ్యులు కూడా నోరు విప్పలేదు. వాళ్లు ఈ విషయం మీద స్పందిస్తే బావుంటుంది… ఇలాంటి వార్తలు వినిపించవు అని ఇండస్ట్రీలో ఓ పెద్దాయన అభిప్రాయం.
previous post
next post
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!