NewsOrbit
రాజ‌కీయాలు సినిమా

చిరు పొలిటికల్ పయనం..! మూడు కూడళ్లలో ఎటువైపు..??

will chiranjeevi move to political way again

తెలుగు సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం నాలుగు దశాబ్దాలుగా అప్రతిహతంగా కొనసాగుతోంది. తెలుగు సినిమా స్థాయిని జాతీయస్థాయికి తీసుకెళ్లిన హీరోగా చిరంజీవి పేరు ప్రఖ్యాతుల గురించి తెలిసిందే. అద్భుతమైన డ్యాన్స్, ఒరిజినల్ ఫైట్స్ చేయాలంటే చిరంజీవి మాత్రమే అనేంతగా యువతను, కుటుంబ ప్రేక్షకులను దశాబ్దాల పాటు అలరించారు. స్వయంకృషితో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ గా ఎదిగిన హీరోగా తెలుగు సీనీ పరిశ్రమ ఆయన్ను గుర్తు పెట్టుకుంటుంది. సినిమాల్లో ఎవరెస్ట్ అంత ఎత్తున ఉన్న చిరంజీవి రాజకీయాల్లో మాత్రం ఆ స్థాయి చూడలేకపోయారు. సీఎం కావాలనుకున్న ఆయన కేంద్ర మంత్రి మాత్రం కాగలిగారు. అయితే.. చిరంజీవి మళ్లీ సీఎం కుర్చీ వైపు అడుగులేస్తారా..? మళ్లీ రాజకీయాల వైపు చూస్తారా.. లేక సినిమాలకే పరిమితం అవుతారా..? ఈ మూడు కూడళ్లలో ఆయన పయనం ఎటు..? చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని ‘న్యూస్ ఆర్బిట్’ అందిస్తున్న కథనం..

will chiranjeevi move to political way again
will chiranjeevi move to political way again

కాంగ్రెస్ ను మళ్లీ నుంచోబెట్టే అవకాశాలను కొట్టి పారేయలేం..

చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పెట్టి ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అనంతరం కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేశారు. అనంతరం రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో కాంగ్రెస్ చచ్చుబడిపోయింది. చిరంజీవి కూడా రాజకీయంగా స్తబ్దుగా ఉండిపోయారు. అయితే.. కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేయలేదు. దీంతో ఆయన తటస్థంగా ఉండిపోయారని చెప్పాలి. చిరంజీవి వంటి నాయకుడిని వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉండదు. చిరంజీవి ఛరిష్మా దక్షిణాదిన తమకు ఉపయుక్తంగా ఉంటుందని భావించే చిరంజీవి తమలో కలుపుకుంది. 2024 ఎన్నికలు కాంగ్రెస్ కు కీలకం. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ జీవం పోసుకోవాలంటే చిరంజీవిఅవసరం ఉంది. కాంగ్రెస్ పునరుజ్జీవానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనతోపాటు చిరంజీవి కలిసి కాంగ్రెస్ ను నిలబెడతారా అనేది తేలాల్సిన అంశం.

బీజేపీ వైపు అడుగులు వేస్తారా.. ఆహ్వానం ఉందిగా..!

మరోవైపు చిరంజీవి తమ పార్టీలోకి రావాలని బీజేపీ ఆశిస్తోంది. ఆయన చరిష్మా ద్వారా ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోంది. 2024 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు సాధించాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకు చిరంజీవి చరిష్మా పనికొస్తుందని బీజీపీ గట్టిగా నమ్ముతోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ జనసేనతో కలిసి నడుస్తోంది బీజేపీ. ఇప్పుడు చిరంజీవిని కూడా తమ పార్టీలోకి రప్పించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే సోము వీర్రాజు చిరంజీవిని కలిశారు. బీజేపీలోకి రావాలని కూడా ఆహ్వానించారు. ఈ ప్రతిపాదనను చిరంజీవి సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కు భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి రాజకీయ భవిష్యత్తు ఆశిస్తే.. తమ్ముడు పవన్ వెళ్తున్న బీజేపీ దారిలోనే వెళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే.. 2024లో బీజేపీకి లాభిస్తుంది. అందుకే బీజేపీకి ఇదొక అవకాశం.

సామాజిక ఉద్యమం వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయా.. లేవా?

ఎవరు అవునన్నా కాదన్నా.. చిరంజీవి ఓ సామాజికవర్గానికి (కాపు) చెందిన వారిగా కూడా గుర్తింపు ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో కమ్మ ఆధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో కాపుల నుంచి చిరంజీవి అత్యంత ప్రతిభావంతుడిగా ఎదిగారు. అప్పటివరకూ ఉన్న కాపు పెద్దలు చిరంజీవిపై దృష్టి పెట్టారు. చిరంజీవి విజయంలో పరిశ్రమలోని కాపు పెద్దల పాత్ర కొట్టివేయలేం. 2009లో చిరంజీవి పార్టీ పెట్టిన సమయంలో ఆయనకు ఆర్ధిక వెన్నుదన్నుగా నిలిచింది.. రాజకీయ భరోసాగా నిలిచింది మాత్రం కాపు సామాజిక వర్గమే. వంగవీటి రంగా తర్వాత ఆస్థాయి అండ తమకు లభిస్తుందని ఆశించారు. చిరంజీవి మాత్రం సామాజిక న్యాయం అంటూ ప్రచారం చేసుకుని అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ వెళ్లారు. అయితే.. చిరంజీవి తమకు బ్రాండ్ అంబాసిడర్ అని చాలామంది కాపు నాయకులు భావిస్తూ ఉంటారు. వంగవీటి రంగా తర్వాత కాపుల్ని ఏకతాటిపై నడిపించే నాయకుడు దొరకలేదు. ముద్రగడ ఉన్నా ఆయన నిలకడలేమి కాపులకు ఉపయోగపడలేదు. కాపులకు ఓ నాయకుడు కావాలని భావిస్తున్న వారికి చిరంజీవి వారికి ఆశాదీపంలా కనిపిస్తున్నారు. మరి చిరంజీవి వారి ఆశను నెరవేరుస్తారా లేదా అనేది చూడాలి. చిరంజీవి సినిమాలపరంగా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని అందరివాడు అనిపించుకున్నారు. ఈ పరిస్థితుల్లో కాపు కులాన్ని మాత్రమే భుజాన వేసుకుని ఉద్యమాలంటూ వారిని వెనుకేసుకు వస్తారనేది అసాధ్యం. కానీ. కాపు నాయకుల ఆశల్లో అర్ధం ఉంది. అందుకే చిరంజీవికి మూడో ప్రత్యామ్నాయం జాతీయపార్టీలో చేరడం. దీని ద్వారా కాంగ్రెస్, బీజేపీల్లో ఏదొక పార్టీలో చేరి తన రాజకీయ పునర్జన్మను పొంది తన హవా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu