Kushi Kushiga : ఖుషీ ఖుషీగా Kushi Kushiga స్టాండప్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖుషీ ఖుషీగా షో స్టాండప్ కామెడీకే మరో అర్థాన్ని చెబుతోంది. తెలుగులో స్టాండప్ కామెడీ షోలు లేవు. మామూలుగా కామెడీ స్కిట్లు చేసే షోలు బాగానే ఉన్నాయి కానీ.. అసలైన స్టాండప్ కామెడీ షోలు లేవు. వాటికి డిమాండ్ కూడా బాగానే ఉంది అన్న విషయాన్ని గ్రహించిన మెగాబ్రదర్ నాగబాబు.. తన సొంత యూట్యూబ్ చానెల్ లో ఖుషీ ఖుషీగా స్టాండప్ కామెడీ షోను ప్రారంభించారు.
ఇప్పటికే మొదటి సీజన్ 8 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఖుషీ ఖుషీగా షోకు బీభీత్సమైన రెస్పాన్స్ వస్తుండటంతో.. రెండో సీజన్ ను కూడా అనౌన్స్ చేశారు. ఎనిమిది ఎపిసోడ్స్ తర్వాత ఖుషీ ఖుషీగా షోకు వచ్చిన స్పందన, కంటెస్టెంట్లు చేసిన పర్ ఫార్మెన్స్.. అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న నాగబాబు.. ఈ సందర్భంగా ఎలిమినేషన్ రౌండ్ లో మాట్లాడారు.
Kushi Kushiga : కమెడియన్స్ కు ఏమాత్రం తీసిపోని కంటెస్టెంట్లు
ఖుషీ ఖుషీగా స్టాండప్ కామెడీలో సెలెక్ట్ అయిన వాళ్లలో దాదాపు అందరూ కొత్తవాళ్లే. అదిరింది టీమ్ కు చెందిన కొందరు కంటెస్టెంట్లు తప్పించి.. మిగితా వాళ్లు అంతా కొత్త వాళ్లే. అయినా కూడా అదిరింది టీమ్ కు ఏమాత్రం తీసిపోకుండా.. కొత్త వాళ్ల స్టాండప్ కామెడీ సూపర్బ్ అని నాగబాబు కొనియాడారు. సద్దాం, కాజా లాంటి అదిరింది టీమ్ తో కూడా ఢీకొట్టి.. వాళ్లతో సమానంగా కామెడీని అందించడంలో ఖుషీ ఖుషీగా షో సక్సెస్ అయిందని ఈ సందర్భంగా నాగబాబు స్పష్టం చేశారు.
ఖుషీ ఖుషీగా రెండో రౌండ్ ఎలిమినేషన్ సందర్భంగా నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.