న్యూస్ సినిమా

ఆమెతో ప్రేమా, దోమా అన్నావంటే కాళ్లు విరగ్గొడతానంటూ వరుణ్ తేజ్‌కి నాగబాబు వార్నింగ్..?

Share

మెగా ఫ్యామిలీలోని హీరోలు ఒకరి తర్వాత ఒకరు ఇండస్ట్రీకి పరిచయం అవుతూనే ఉన్నారు. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో హీరోగా సుపరిచితుడయ్యాడు. ఈ హీరో తన ప్రతి సినిమాలో కొత్తదనాన్ని చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. కామెడీ, మాస్, పక్క రొమాంటిక్ స్టోరీలతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచుతాడు. గద్దల కొండ గణేష్ లాంటి మాస్ యాక్షన్ సినిమాలో అద్భుతంగా నటించి ప్రేక్షకులు చేత పర్ఫెక్ట్ మెగా ఫ్యామిలీ మెన్ అనిపించుకున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కూడా వరుణ్ తేజ్ తన నటనతో మెప్పించాడు. వరుణ్ తేజ్ హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాడు.

ఆమెతో పీకల్లోతు లవ్

సినిమాల వరకు బానే ఉంది కానీ తన పర్సనల్ లైఫ్‌లోనే ఓ చిక్కొచ్చిపడింది. అదేంటంటే, వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠితో గత రెండు ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు ఏకంగా లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీ ఇంటి కోడలు కాబోతుందనే పుకార్లు కూడా పుట్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా వరుణ్ ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఓ కామన్ ఫ్రెండ్ బర్త్‌ డే పార్టీలో వీరు క్లోజ్ గా కలిసి కనిపించారు. దాంతో మళ్లీ వీరి డేటింగ్ సంబంధించిన రూమర్స్ బయటికి వస్తున్నాయి. ఫొటోలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

కాళ్లు విరగ్గొడతానన్న నాగబాబు?

అయితే ఫొటోలు వైరల్ కావడంతో నాగబాబు ఈ విషయంపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. “ఏం వరుణ్ నిజంగానే ఆ అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నవా?” అని అడిగినట్లు… “లేదు నాన్న” అని వరుణ్ చెప్పినట్లు టాక్. ఆమెతో ప్రేమా, దోమా అన్నావంటే కాళ్లు విరగ్గొడతానంటూ వరుణ్ తేజ్‌కి నాగబాబు వార్నింగ్ కూడా ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి దీనిలో ఎంత నిజముందో తెలియదు.


Share

Related posts

కెరీర్‌లోనే తొలిసారి!

Siva Prasad

టిడిపికి గుడ్‌బై

somaraju sharma

డ్రైఫూట్ ‘గ్యాంగ్ లీడర్ అరెస్ట్!అతనెవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Yandamuri