Nagarjuna: సినిమా ఇండస్ట్రీ లో ఎంత స్టార్ డం, క్రేజ్ ఉన్నప్పటికీ టాలెంట్ ఉన్నవాడే చివరికి పైచేయి సాధిస్తాడు అనేది ఎన్నో సార్లు నిరూపితమైంది. ఇక మేటర్ లోకి వచ్చేస్తే సంక్రాంతి కానుకగా ఎన్నో చిన్న సినిమాల మధ్య విడుదలైన బంగార్రాజు చిత్రం మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. పైగా ఫ్యామిలీలు చూసేందుకు ఒక్క పెద్ద సినిమా కూడా లేకపోవడంతో అందరూ బంగార్రాజు బాట పట్టారు. అదీ కాకుండా ఈ చిత్రంలో నాగార్జున తో పాటు అతని కొడుకు నాగచైతన్య కూడా నటించాడు.
ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు, పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా కమర్షియల్ ఫ్యామిలీ సినిమా అది కూడా సంక్రాంతికి టాలీవుడ్ లో రిలీజ్ అయింది చిత్రం ఫలితంతో సంబంధం లేకుండా కలెక్షన్లు వెల్లువెత్తుతాయి. అయితే ఇప్పటివరకూ 2022 సంవత్సరంలో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా బంగార్రాజు మొన్నటి వరకు ఉంది.
పెద్ద సినిమాలు ఏవీ ఇంకా రిలీజ్ కాలేదు. అయితే ఒక్కసారిగా బంగార్రాజు పేరు పై ఉన్న రికార్డు ఒక యువ హీరో బద్దలు కొట్టేశాడు. పైగా అతను హీరోగా థియేటర్లలో ప్రదర్శించబడిన రెండవ సినిమా ఇది. గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లుగా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కేవలం రెండు రోజుల్లో నాగార్జున చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దాట లేదు కానీ అమెరికాలో మాత్రం బంగారాజు దక్కించుకున్న వసూళ్లను ఇప్పటికే డీజే టిల్లు దాటేసింది.
అమెరికాలో భారీగా ప్రీమియంలు, వీకెండ్ షోల బుకింగ్స్ నమోదయినట్లు బయర్లు అధికారికంగా ప్రకటించడం గమనార్హం. రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ డీజే టిల్లు సినిమాను అమెరికాలో పంపిణీ చేసింది. వాళ్లకి కూడా రాబోయే రోజుల్లో వసూళ్ల వర్షం ఖాయంగా కనిపిస్తోంది.