NewsOrbit
న్యూస్

YCP MLA Nallapareddy: నాడు ‘వారు’ చేసిందే నేడు ‘వీరు’ చేస్తున్నారా..? జగన్‌ది ఒక మాట..ఆ పార్టీ ఎమ్మెల్యేది మరో మాట..! మీరు వినండి..!!

Nallapareddy Prasanna Kumar controversial comments

YCP MLA Nallapareddy: గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలను పెట్టి పచ్చ చొక్కాల వారికే సంక్షేమ పథకాలు అందించారంటూ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల ప్రచార సందర్భంలో, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కూడా వైఎస్ జగన్..కులాలు చూడం, మతాలు చూడం..పార్టీలు చూడం..అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామంటూ వాగ్దానం చేశారు. రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఈ మాటలను విశ్వసించారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే రాష్ట్రంలో పరిపాలన మారినా విధానాలు మారడం లేదు. నాడు వారు (టీడీపీ ప్రభుత్వం) చేసిందే నేడు (వైసీపీ ప్రభుత్వం) వీరు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.     ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీ వారికే సంక్షేమ పథకాలు అందాలి, అందుతున్నాయి అనడానికి ఇది ఓ ఉదాహారణ. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అధికారులకు రహస్యంగా చెప్పి పనులు కానిస్తుండగా కొందరు ఎమ్మెల్యేలు అయితే బాహాటంగానే అధికారులకు ఏకపక్షంగా పని చేయాలంటూ హెచ్చరిస్తున్నారు.

Nallapareddy Prasanna Kumar controversial comments
Nallapareddy Prasanna Kumar controversial comments

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మాటలకు భిన్నంగా నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేరే పార్టీ వారికి అసలు పనులు చేయడానికి వీలులేదంటూ అధికారులకు హుకుం జారీ చేయడం విశేషం. ఎమ్మెల్యే నల్లపురెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఏమన్నారంటే.. అధికారులకు ఇప్పుడే చెబుతున్నా..టీడీపీ సర్పంచ్ కి గానీ, ఇంకెవరైనా నాయకులకు గానీ ఎలాంటి పనులు చేయడానికి వీలులేదు, పల్లెపాడు సర్పంచ్ గా పోటీ చేసి ఓటమి పాలైన స్థానిక వైసీపీ నేత కుమార్ రెడ్డి చెప్పిందే అధికారులు చేయాలి. గ్రామాల్లో గానీ మండలంలో గానీ అధికారులు వేరే పార్టీ వారికి పనులు చేసినట్లు తెలిస్తే వారిపై చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నల్లపురెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది కొత్త కాదు. ఇంతకు ముందు జిల్లా ఎస్పీపైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత జగనన్న ఇళ్లు సోభనానికి కూడా పనికి రావంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారూ జగన్ స్వామ్యం కాదిది. ప్రజాస్వామ్యం. టీడీపీకి ఓటేస్తే, టీడీపీ ప్రజా ప్రతినిధులు గెలిస్తే..అక్కడ అధికారులు పని చేయొద్దా ? నియోజకవర్గం నీ తాత జాగీరా? అధికారమదం దిగే రోజు తొందర్లోనే వస్తుంది. అప్పుడు తెలుస్తుంది.. ఎన్నుకునే ప్రజల విలువ – ప్రజాస్వామ్యం విలువ” అంటూ లోకేష్ విమర్శించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju