Spotify: ప్రముఖ ఆన్ లైన్ మ్యూజిక్ యాప్ స్పాటిఫై తన వినియోగదారుల కోసం మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను తీసుకొచ్చింది. ఈ యాప్ లో లక్షల కొద్ది పాటలు మనకు అందుబాటులో ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా చాలా మంది సంగీత ప్రియులు స్పాటిఫై యాప్ ను తమ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకుని సంగీతాన్ని ఆనందిస్తున్నారు. కానీ ఇన్ని రోజులు ఈ యాప్ లో లైవ్ లిరిక్స్ అనే ఫీచర్ మనకు అందుబాటులో లేదు. ఈ ఫీచర్ లేకపోవడంతో కొద్ది మంది యూజర్లు.. అనేక ఇబ్బందలకు లోనయ్యారు.
Children: పిల్లలకు మలబద్దక సమస్య ఉందా ??ఇలా నివారించండి !!
అసలేంటీ లైవ్ లిరిక్స్..
లైవ్ లిరిక్స్ అనే ఫీచర్ గురించి కామన్ పీపుల్ కు ఎక్కువగా తెలియకపోయినా కూడా సంగీత ప్రియులకు మాత్రం తెలుసు. ఈ ఫీచర్ ఉండడం వలన మనం పాట వింటున్న సమయంలో ఆ పాట లిరిక్స్ అనేవి లైవ్ గా మన ఫోన్ డిస్ ప్లే మీద ప్లే అవుతూ ఉంటాయి. మనం పాట వింటూ ఎంచక్కా ఆ లిరిక్స్ ను చూడొచ్చు. స్పాటిఫై యాప్ కాకుండా మిగతా మ్యూజిక్ యాప్ లలో ఎప్పుడో ఈ ఫీచర్ వచ్చినప్పటికీ స్పాటిఫై యాప్ లో మాత్రం ఈ ఫీచర్ ఇన్ని రోజులు అందుబాటులో లేదు. ఇప్పటి నుంచి లైవ్ లిరిక్స్ ఫీచర్ ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నట్లు స్పాటిఫై ప్రకటించింది. మొబైల్ వినియోగదారుతో పాటు డెస్క్ టాప్ వెర్షన్ వాడుతున్న వినియోగదారులకు కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉండనుంది. సెలెక్టెడ్ స్మార్ట్ టీవీలలో కూడా ఈ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది.
Spotify Technology : మ్యూజిక్ ప్రియులకు కొత్త టెక్నాలజీ..!!
నిరీక్షణకు తెర..
ఇన్నాళ్లూ ప్రేక్షకుల నిరీక్షణకు తెర దించుతూ స్పాటిఫై రియల్ టైమ్ లిరిక్స్ ఆప్షన్ ను తమ యూజర్ల కోసం ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ వలన ఈ యాప్ వాడుతున్న వారికి కొత్త అనుభూతి కలిగే అవకాశం ఉంది.