NewsOrbit
న్యూస్

ఏపీ రాజకీయాల్లో కొత్త ట్రెండ్!ఆలయాల్లో ప్రమాణాల పర్వం!నిన్న అనపర్తి …నేడు విశాఖ!!

విశాఖ లో ఆదివారం కాస్తా హాట్‌ సండే అయ్యింది. రాజకీయ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీకి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని అధికారులు ఇటీవల కూల్చివేతకు దిగడంతో మొదలైన వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది.

విజయసాయి ట్వీట్ తో మొదలైన వివాదం

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో రామకృష్ణబాబు భూకబ్జా వ్యవహారంపై ట్వీట్ చేశారు. చంద్రబాబు అండతో టీడీపీ నేతలు వేల కోట్ల విలువైన భూముల్ని అక్రమంగా దోచేశారంటూ ఆరోపించారు.విజయసాయిరెడ్డి ఆరోపణలపై స్పందించిన వెలగపూడి… పారదర్శకంగా దర్యాప్తు నిర్వహిస్తానని బాండ్ పేపర్‌పై రాసి ఇస్తావా? అని ప్రశ్నించారు. గజం కూడా ఆక్రమించలేదని నిరూపణ అయితే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తావా అని సవాల్ విసిరారు. అయితే దీనికి విశాఖ తూర్పు ఇంచార్జ్ విజయనిర్మల… తాను వస్తానంటూ ప్రతి సవాల్ చేసారు. అంతేకాదు ఏకంగా సాయిబాబా ఫోటోతో వెళ్లి మరింత ఉద్రిక్తత పెంచారు. కానీ తాను రమ్మన్నది విజయసాయిరెడ్డినని… అతను వస్తే ప్రమాణం చేస్తానని శాసన సభ్యుడు వెలగపూడి ట్విస్ట్ ఇచ్చారు. ఎంపీ విజయసాయిరెడ్డి వస్తే… తాను ఎక్కడ ప్రమాణం చేయమన్నా చేస్తానని రామకృష్ణబాబు స్పష్టం చేశారు.

వైసిపి ఎమ్మెల్యే రాక ..వెలగపూడి గైర్హాజరు

కాగా వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ కార్యకర్తలతో ఆదివారం ర్యాలీగా సాయిబాబా ఆలయం వద్దకు వచ్చారు. అంతకుముందు ఆయన భారీ ర్యాలీగా వైఎస్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఈస్ట్ పాయింట్ కాలనీలో సాయిబాబా ఆలయం వద్దకు చేరుకున్నారు అమర్‌నాథ్‌. మొదట సవాల్ చేసింది టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణేనని, ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే సవాలును స్వీకరించి సాయిబాబా గుడి వద్దకు రావాలని లేదంటే రాజకీయాల నుంచి వైదొలగాలని హెచ్చరించారు. ఆలయంలో వెలగపూడి కోసం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఎదురుచూశారు. అప్పటికి వెలగపుడి రాకపోవడంతో.. సవాల్ చేసినట్టు ఓడిపోయినట్టు ఒప్పుకోవాలన్నారు గుడివాడ అమర్‌నాథ్‌ రెడ్డి.కాగా ఆరోపణలు చేసుకోవటం వాటికి సంబంధించి ఆలయాల్లో ప్రమాణాలకు సవాల్ విసురుకోవటం అనేది ఇప్పుడు కొత్తగా ఏపీలో మొదలైన ట్రెండ్!

 

author avatar
Yandamuri

Related posts

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?