NewsOrbit
న్యూస్

పేరే కాదు! అంతా వెరైటీ నే!! ఎవరామె? ఏమిటా కథ??

నెటిజన్లకు బాగా సుపరిచితమైన పేరు అమ్రపాలి.నిజానికి పరిచయం అవసరం లేని పేరు కూడా అదే! పేరే వెరైటీ అనుకుంటే ఈ మహిళా యువ ఐఎఎస్ అధికారిణి అంతకన్నా వెరైటీ!

Not the name Everything is Variety  What's the story,amrapali
Not the name Everything is Variety What’s the story,amrapali

జస్ట్ యూనివర్సిటీ పాస్ ఔట్ స్టూడెంట్ లాగ ఆమె యాక్టివిటీస్ ఉంటాయి.అదే ఆమెకు క్రేజ్ తెచ్చిపెట్టింది.ఆమే ఇప్పుడు ప్రకాశం ప్రకాశం జిల్లా కీర్తిని ఇనుమడింపజేసింది.విషయానికొస్తే ప్రకాశం జిల్లా కి చెందిన ఆడపడుచు, ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలిని ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో నియమించారు. అపాయింట్‌మెంట్‌ ఆఫ్‌ కేబినెట్‌ సెలక్షన్‌ కమిటీ ఆమెను పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా ఎంపిక చేసింది. ఆమ్రపాలి స్వగ్రామం  ఒంగోలు నగర శివారులోని ఎన్‌.అగ్రహారం. గ్రామానికి చెందిన కాటా వెంకటరెడ్డి, పద్మావతిలకు ఆమె మొదటి సంతానం.

Not the name Everything is Variety  What's the story,amrapali
Not the name Everything is Variety Whats the storyamrapali

అగ్రహారంలో పుట్టి విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు ఆమ్రపాలి. ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌లో 2010 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారిణిగా విధుల్లో చేరారు. రాష్ట్రం విడిపోయాక తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం  పీఎంవోలో డిప్యూటీ  సెక్రటరీగా నియమితులయ్యారు.అతి చిన్నవయసులోనే ఈ పోస్టులో నియమితులైన వారిలో ఒకరిగా ఆమ్రపాలి నిలిచారు. ఈ పోస్టులో ఆమె 2023 అక్టోబర్‌ 23 వరకు అంటే మూడేళ్ల పాటు విధులు నిర్వర్తిస్తారు. ఐఏఎస్‌కు ఎంపికైన తరువాత  2011లో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా మొదట విధుల్లో చేరారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.

Not the name Everything is Variety  What's the story,amrapali
Not the name Everything is Variety Whats the storyamrapali

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నగర అదనపు కమిషనర్‌గా కూడా పనిచేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఓఎస్డీగా కూడా వ్యవహరించారు .ఆమ్రపాలికి ఇటీవలే వివాహమైంది.జమ్ము కాశ్మీర్ కేడర్ కి చెందిన ఐఎఎస్ అధికారిని ఆమె వివాహమాడారు.విధి నిర్వహణలోనే కాకుండా ఇతరత్రా కూడా చాలా చురుగ్గా అమ్రపాలి ఉంటారు.సాహస యాత్రల నిర్వహణ పట్ల ఆమెకు ఆసక్తి పెచ్చు.ట్రెక్కింగ్ అంటే ఆమ్రపాలికి మహా ఇష్టం.

Not the name Everything is Variety  What's the story,amrapali
Not the name Everything is Variety Whats the storyamrapali

సోషల్ మీడియాలో కూడా అమ్రపాలి ఎక్కువగా ఉండటంతో ఆమెకు లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.సంప్రదాయ దుస్తులలోనే కాకుండా మోడరన్ వేషధారణలో కూడా అమ్రపాలి కనిపించడం కొన్నిసార్లు వివాదాస్పదమైంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కలెక్టర్లుగా పనిచేసిన అనేక మంది మహిళల్లో అమ్రపాలి ఒక్కరే అందరికన్నా ఎక్కువగా ప్రజాదరణ పొందారు అన్నది నిర్వివాదాంశం.ఏదేమైనా ప్రకాశం జిల్లా కీర్తి కిరీటంలో అమ్రపాలిని కలికితురాయి గానే చెప్పాలి!

author avatar
Yandamuri

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju