పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీలో అభిమానులు మాత్రమే కాక వీరాభిమానులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు అభిమానులు మాత్రమే ఉంటే పవన్ కళ్యాణ్ కి హీరోలలో అదేవిధంగా నిర్మాతలలో కూడా అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తే ముందుగా బండ్ల గణేష్ గురించి మాట్లాడుకోవాలి.
పవన్ నా దేవుడు అంటూ బండ్ల గణేష్ భక్తుడు తరహాలో స్పీచ్ చాలా సందర్భాల్లో ఇవ్వటం జరిగింది. పవన్ అభిమానులు కూడా బండ్ల గణేష్ కి మంచి ప్రయారిటీ ఇస్తుంటారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం క్రిస్మస్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా దంపతులు సినిమా ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులకు క్రిస్మస్ కానుకలు పంపారు.
మహేష్ బాబు, రానా తమకు గిఫ్ట్ పంపినందుకు కృతజ్ఞతలు అని తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేయగా, తాజాగా బండ్ల గణేష్ కూడా తనకు గిఫ్ట్ అందిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశాడు. వారిద్దరూ గబ్బర్ సింగ్ టైం లో కలిసి దిగిన ఫోటో గిఫ్ట్ దగ్గర పెట్టి “మీ ప్రేమకు ఎప్పుడు బానిసనే పవన్ కళ్యాణ్ నా దైవం” అంటూ పోస్ట్ చేసి మరోసారి తన అభిమానాన్ని బండ్ల గణేష్ చాటుకున్నాడు.