న్యూస్ బిగ్ స్టోరీ

Pegasus Spyware: అసలేంటీ ‘పెగాసస్’? ఈ స్పైవేర్ వల్ల ముప్పు ఎవరికి?

Pegasus Spyware explained clinically
Share

Pegasus Spyware: ప్రస్తుతం భారతదేశం సహా అనేక దేశాల్లోని బడా బడా రాజకీయ నేతలను, రిపోర్టర్లను, పారిశ్రామికవేత్తలను వణికిస్తున్న పేరు ‘పెగాసస్’. ‘పెగాసస్’ అనేది ఇశ్రాయేలీ కంపెనీ అయినటువంటి ‘ఎన్ఎస్ఓ’ గ్రూప్ వారు డెవలప్ చేసిన స్పైవేర్. ఇది మొబైల్ ఫోన్లలో, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలలో ఇన్స్టాల్ చేయబడుతుంది. ఒకసారి పెగాసస్ స్పై వేర్ ఇంస్టాల్ అయిన ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉండే సమాచారం మొత్తాన్ని అది కంట్రోల్ చేస్తుంది. అంటే… ఫలానా మొబైల్ ఫోన్ లోని టెక్స్ట్ మెసేజ్ లు, ఈ మెయిల్, గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్ లలోని శోధనలను కూడా ఇది తెలుసుకుంటూ ఉంటుంది. 

 

Pegasus Spyware explained clinically

కాబట్టి ఆ పరికరానికి సంబంధించిన కంట్రోల్-కమాండ్ సర్వర్లు దీన్ని ఆధీనంలో ఉంటాయి. అంతేకాకుండా మొబైల్ ఫోన్ ఓనర్ ఉండే ప్రదేశాన్ని ట్రాక్ చేయడం, వారి ఫోన్ కాల్స్ రికార్డ్ చేయడం, వినడం, అలాగే చివరికి ఫోన్లోని మైక్రోఫోన్, కెమెరా వంటివి కూడా హైజాక్ చేయడం దీని పని. Pegasus spyware ఇన్స్టాల్ చేయబడిన మొబైల్ ఫోన్స్ లో ఇది నిత్యం నిఘానేత్రం గా పనిచేస్తుంది. Ios, android లోని కొన్ని వర్షన్లలో ఈ ‘పెగాసస్’ ను ఇంటర్నెట్ ద్వారా ఇన్స్టాల్ చేయవచ్చు. 

ఏవైనా అనామక లింక్స్ ను క్లిక్ చేసినప్పుడు…. లేకపోతే అనుమానిత అప్లికేషన్స్ ను డౌన్లోడ్ చేసినప్పుడు ఈ స్పైవేర్ యూజర్స్ కి తెలియకుండానే వారి ఎలక్ట్రానిక్ పరికరాలలోకి ఎంటర్ అవుతుంది. కొన్ని ఎక్స్పర్ట్ వర్షన్స్ లో అయితే యూజర్ ప్రమేయం అసలు లేకుండా మొబైల్ ఫోన్స్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో కి ఈ స్పైవేర్ ఇన్స్టాల్ చేసే అవకాశం కూడా ఉంది. 

ఇక దీనికి ఉన్న అద్భుతమైన ఫీచర్ ఏమిటంటే… ఎటువంటి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కూడా దీనిని కనుక్కోలేదు. ఈ స్పైవేర్ మామూలు ఫోన్ ఫీచర్ గానే చలామణి అవుతూ డివైస్ లో ఇమిడి ఉంటుంది. ఇక చాలా సురక్షితమైన అత్యాధునిక అప్లికేషన్లు అయినటువంటి వాట్సాప్, ఐ మెసేజ్, స్కైప్, టెలిగ్రామ్, జిమెయిల్, ఎస్ఎంఎస్ వంటి అధునాతన సాఫ్ట్వేర్ లు కలిగినవి కూడా ఈ పెగాసస్ బారిన అలవోకగా పడుతాయి. వీటిలో ఉండే సమాచారం మొత్తం ‘పెగాసస్’ తీసుకుంటుంది.

ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ ను ‘ఎన్ఎస్ఓ’ గ్రూప్ వారు పలు దేశాల్లోని ఇంటెలిజెన్స్ లేదా మిలిటరీ వ్యవస్థలకు, ఇంకా ప్రభుత్వాలకు అమ్మేందుకు రెడీగా ఉన్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా నేరాలు, స్కాంలు, ప్రజలను రెచ్చగొట్టే చర్యలు చేసే వారి ఆట కట్టించవచ్చు. ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ పెగాసస్ స్పైవేర్ కనుక ప్రభుత్వం లేదా ఇంటలిజెన్స్ కొనుగోలు చేస్తే రాజకీయవేత్తలు, రిపోర్టర్ల బండారాలు, ఆదాయపన్ను ఎగవేతదారులు అందరూ చాలా సులువుగా బయటకు వచ్చేస్తారు. 

మరి ఈ పెగాసస్ ఎంత కాలం మన ఫోన్ లేదా ఇతర పరికరాలు లో ఉంటుంది అంటే… దానిని మనం గుర్తించనంత వరకూ ఇది దాని పని అది చేసుకుంటూపోతుంది. ఒకవేళ కమాండ్-కంట్రోల్ సర్వర్ ఈ స్పైవేర్ ను కమ్యూనికేట్ చేయలేని పక్షంలో 60 రోజుల తర్వాత దీనికై ఇదే దాక్కొని స్వీయ విధ్వంసం చేసుకుంటుంది. కాబట్టి పెగాసస్ స్పైవేర్ మన మొబైల్ ఫోన్ లో ఉన్నట్లు గానీ దాగినట్లు కానీ దాని విధ్వంసం చేసుకున్నట్టుగానీ ఎప్పటికీ కనిపెట్టలేము. మొత్తానికి ఈ ‘పెగాసస్ స్పై వేర్’ వలన వల్ల మానవాళి ఆధునిక జీవితాలలో పెను మార్పులు చోటు చేసుకోవడం ఖాయం.


Share

Related posts

కేసీఆర్ , జ‌గ‌న్ ఒకే టీం అంటూ …టీడీపీ ఏం చేస్తుందో తెలుసా?

sridhar

Ram Charan : రామ్ చరణ్ కోసం సౌత్ కొరియా నుంచి..!!

sekhar

చంద్రబాబు కూడా తగ్గడం లేదు… అచ్చెన్న కేసులో స్ట్రాంగ్ దూకుడు!

CMR