NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Tirupathi bypoll : తిరుపతిలో ఆ తిట్లేంటి..? ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పార్టీలు..!!

Tirupathi bypoll : తిరుపతి ఉప ఎన్నిక Tirupathi bypoll మండే ఎండల్లో పొలిటికల్ హీట్ పెంచేసింది. నామినేషన్ల ఘట్టం కూడా పూర్తవడంతో ఎన్నికల రణరంగం మొదలైపోయింది. పార్టీలు, నాయకులు హోరాహోరీ ప్రచారం మొదలెట్టేశారు. ఉపఎన్నిక ప్రచారం హడావిడి చూస్తూంటే రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల హడావిడిని తలపిస్తోంది. విమర్శలు, కౌంటర్లు నుంచి వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లిపోయాయి పరిస్థితులు. నిన్న విజయసాయి రెడ్డి, సోము వీర్రాజు ట్వీట్ వారే ఇందుకు నిదర్శనం. ఈరోజు ప్రచార హోరు మొదలైన వెంటనే వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైపోయింది. ఇందుకు ఓ ప్రచార గీతం కూడా కారణమైంది.

political fight started in tirupati
political fight started in tirupati

ఎన్నికల్లో వైసీపీ కోసం ఓ ట్యూన్ కట్టించి జగన్ పై పాట పాడిస్తే.. దానిని బీజేపీ కాపీ కొట్టిందని వైసీపీ శ్రేణులు ఆరోపించారు. దీనికి బీజేపీ కూడా కౌంటర్ ఇచ్చింది. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ పథాకాలతో జగనన్న పథకాలు అని పేరు పెట్టుకుని మీరే కాపీలు కొట్టారని కౌంటర్లు ఇచ్చారు. టీడీపీ-సీపీఐ పొత్తుపై కూడా గట్టి కౌంటర్లే పడ్డాయి బీజేపీ నుంచి. నిన్నటి టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకలు.. అంతిమ వేడుకల్లా అనిపించాయని, అంతిమ దశలో ఉన్న పార్టీ వెళ్లి నారాయణ చెవిలో నారాయణ.. నారాయణ అంటున్నారని టీడీపీకి కౌంటర్ ఇచ్చారు. రెండు వయసు మళ్లిన పార్టీలు ఒకరికొకరు కలిసి ఓదార్చుకోవడం తప్ప ఏం లేదని అన్నారు జీవీఎల్. టీడీపీకి ఇవే ఆఖరి ఎన్నికలు అని కూడా అన్నారు.

రత్నప్రభ ఓడిపోతారని తెలిసినా ఇక్కడ అభ్యర్ధిగా నిలబెట్టి మోసం చేస్తున్నారని వైసీపీ అంటోంది. గతంలో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీకి ఆనాడు చంద్రబాబు ఒప్పుకున్నారని రత్నప్రభ అంటే.. చంద్రబాబు ప్రత్యేకంగా ప్యాకేజీ తీసుకున్నారేమో అని వైవీ సుబ్బారెడ్డి కౌంటరిచ్చారు. తిరుపతి ఉప ఎన్నిక హిందువులకు, హిందూ ద్రోహులకు మధ్య జరుగుతున్న ఎన్నిక అని బీజేపీ తన మార్క్ రాజకీయం మొదలుపెట్టింది. గతంలో చంద్రబాబును తిట్టిన టీడీపీ ప్రస్తుత అభ్యర్ధి పనబాక మాటలను ట్వీట్ చేశారు సోము వీర్రాజు. ఇలా.. నామినేషన్లు ముగిసిన మరుసటి రోజే తిరుపతిలో రాజకీయ పార్టీల తిట్ల పర్వం మొదలైపోయింది.

author avatar
Muraliak

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju