Prabhas Adipurush : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ క్రేజీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈ మధ్యకాలంలో డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ల పైన గుడ్ న్యూస్ లు వస్తున్నాయి. ‘రాధే శ్యామ్’ రిలీజ్ కి రెడీ అయిపోయింది. వాలెంటైన్స్ డే కి ఈ చిత్రం టీజర్ వస్తుంది అని పక్కా సమాచారం. మరొకవైపు ఆదిపుష్ తో పాటు ప్రభాస్ ‘సలార్’ సినిమా కూడా ఒకేసారి చేస్తున్నాడు. ఒకేసారి రెండు సినిమాలు ప్రభాస్ చేయడం తన కెరీర్ లో ఇదే మొదటిసారి.
ప్రస్తుతం హైదరాబాద్ లో సలార్ షూటింగ్ జరుపుకుంటుంది. ఆదిపురుష్ కోసం ముంబై కి విమానంలో వెళ్లి వస్తున్నాడు. ఒకటేమో మాఫియా డాన్ పాత్ర అయితే మరొకటి శ్రీరాముడి పాత్ర. ఒకటి యాక్షన్ సినిమా… మరొకటి పౌరాణిక సినిమా. ఇంత రిస్క్ ని ప్రభాస్ చాలా సులభంగా చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలను ఇదే సంవత్సరంలో పూర్తి చేయాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడు. ఆదిపురుష్ అయితే ఎక్కువగా టెక్నాలజీ మీద ఆధారపడే సినిమా. దానిని త్వరగా పూర్తి చేసి ఆగస్టు 11న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ఫిక్స్ అయిందట.
అయితే అదే నెలలో అల్లు అర్జున్ సినిమా రిలీజ్ కూడా ఉంది. అది ఆగస్టు 13వ తేదీన విడుదల కానుంది. మరి దానికి పోటీగా ప్రభాస్ రామబాణం వదులుతాడా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. ఇకపోతే మరొకవైపు అదే నెలలో పవన్ కళ్యాణ్-రానా మల్టీస్టారర్ కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి ఒకవేళ ఎవరు వెనక్కి తగ్గక పోతే రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ తో, పవర్ స్టార్ రీమేక్ సినిమాతో, స్టైలిష్ సుకుమార్ ‘పుష్ప’ తో పోటీ పడాల్సి వస్తుంది.
ఇక ఆదిపురుష్ షూటింగ్ మొదటి రోజే ఈ సినిమా కు అంతరాయం కలిగింది అని వార్తలు వచ్చాయి. ఆగస్టు 11 అంటే సినిమా రిలీజ్ కు గట్టిగా ఏడు నెలల సమయం ఉంది. మరి ఈ లోపు ఓం రౌత్ దర్శకుడు ఈ సినిమాను ఫ్యాన్స్ కు వచ్చేటట్లు సమర్థవంతంగా తీయగలడా లేదా అన్నదే ప్రశ్న…!