Prabhas Chiru: డైరెక్టర్ మారుతి ఏ సినిమాలు చేసినా నా నిర్మాతలకు మంచి లాభాలు వచ్చే విధంగానే చేస్తాడు. మారుతి కింద స్థాయి నుంచి రావడంతో మాస్ జనాలకు ఏం నచ్చుతుందో బాగా తెలుసు. స్టార్ హీరోలు కూడా మారుతితో సినిమా చేయటానికి ఇష్టపడుతున్నారు. మారుతి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయినా ఇంతవరకు ఊ ఏ స్టార్ హీరో డేట్స్ ఇవ్వలేదు… హీరో వెంకటేష్ ఒక్కడే డేట్స్ ఇచ్చాడు దాంతో బాబు బంగారం సినిమా తీశారు.
కానీ వెంకీ తో తీసిన బాబు బంగారం సినిమా ఫ్లాప్ గా మిగిలింది. సాయి ధరమ్ తేజ్ తో ‘ప్రతిరోజూ పండగే’ సినిమా తీసి భారీ విజయం సాధించి తను మంచి డైరెక్టర్ అని నిరూపించుకున్నాడు. గోపీచంద్ హీరోగా ఇప్పుడు ‘పక్కా కమర్షియల్’ అనే సినిమా ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చిందని ప్రభాస్ కూడా మారుతితో సినిమా చేయాలనుకుంటున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి మారుతి తో సినిమా చేయాలనుకుంటున్నారని ఈమధ్య పుకార్లు వస్తున్నాయి. తన తదుపరి సినిమాల గురించి మారుతి ఊహాగానాలు వద్దు అని మీడియాకి చెబుతున్నారు. ఈసారి సినిమా తీస్తే తన కెరీర్ గ్రాఫ్ పెంచే సినిమానే చేస్తాను అంటూ మారుతి చెప్పారు. సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను అని అన్నారు.
మెగాస్టార్ గాని ప్రభాస్ గానీ మారుతికి అవకాశం ఇస్తే మారుతి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సగటు ప్రేక్షకుడికి ఏమి కావాలో మారుతికి తెలిసినంత ఎవరికీ తెలియదు. అందుకే తను చేసే ప్రతి సినిమా లో ఒక బోల్డ్ పాయింట్‌ని తీసుకొని, ఆ పాయింట్ చుట్టూ కదా అల్లుకొని తన సినిమాలు హిట్ కొడుతున్నాడు.
స్టార్ హీరోలతో మారుతి సినిమాలు చేస్తే ఎంత వరకు అవి సక్సెస్ అవుతాయి? ఇది అందరికీ ఎప్పటినుంచో ఉన్న డౌట్. వెంకటేష్ కు పెద్ద ఫ్లాప్ ని ఇచ్చిన మారుతి, స్టార్ హీరోల సినిమాలకి పనికిరాడు అనే భావన కూడా
ప్రేక్షకులకి ఉంది. అలాంటిది చిరు , ప్రభాస్ ఏం చూసి మారుతి ని అంత నమ్మేశారో వేచి చూడాలి.