Prabhas : ప్రభాస్ రాధే శ్యామ్ నుంచి లేటెస్ట్ పోస్టర్ రిలీజ్ చేస్తూ టీజర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్. ఇదే ఇంతకాలం డార్లింగ్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజాహెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’. యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14 న టీజర్ ఫస్ట్ గ్లింప్స్ రాబోతోంది. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ దర్శక నిర్మాతలు ప్రభాస్ సోలో పోస్టర్ ని రిలీజ్ చేశారు.
ఫిబ్రవరి 14న ఉదయం 9 గంటల 18 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తాజా పోస్టర్ ద్వారా వెల్లడించారు. విక్రమాదిత్య గా ప్రభాస్ ప్రేరణ గా పూజా హెగ్డే కనిపించబోతున్న ఈ పీరియాడికల్ లవ్ స్టోరీ సమ్మర్ లో రిలీజ్ కానుంది. ప్రభాస్ కెరీర్ లో 20 వ సినిమాగా రూపొందుతున్న రాధే శ్యామ్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ స్థాయిలో అన్నీ ప్రధాన భాషల్లో రాధే శ్యామ్ ని రిలీజ్ చేయనున్నారు. ఇక సాహో తర్వాత రెండేళ్ళ లాంగ్ గ్యాప్ రావడం తో రాధే శ్యామ్ మీద దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే.
Prabhas : ప్రస్తుతం ప్రభాస్ సలార్ తో పాటు ఆదిపురుష్ సినిమాలతో సెట్స్ మీద ఉన్నాడు.
కాగా మేకర్స్ తాజాగా రాధే శ్యామ్ కి మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఫైనల్ చేశారు. తెలుగుతోపాటు మిగిలిన దక్షిణాది భాషలకు మ్యూజిక్ సమకూర్చే బాధ్యతను జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. ‘రాధే శ్యామ్’ హిందీ వెర్షన్ కు సంబంధించి మిథున్ – మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని హిందీలో టీ-సిరీస్ గుల్షన్ కుమార్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్ – వంశీ – ప్రమోద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సలార్ తో పాటు ఆదిపురుష్ సినిమాలతో సెట్స్ మీద ఉన్నాడు.