NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nimmagadda Ramesh : నిమ్మ‌గ‌డ్డ సంచ‌ల‌న నిర్ణ‌యంతో చంద్ర‌బాబు కు మైండ్ బ్లాంక్ అవ‌డ‌మేనా?

Nimmagadda Ramesh : నిమ్మగడ్డ రమేష్ కుమార్… ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఈసీ . గ‌త కొద్దికాలంగా ఆయ‌న వార్త‌ల్లో వ్య‌క్తిగా మారిపోయారు. ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడత ఎన్నికలు ముగియడంతో రెండో విడతకు ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమవుతున్న‌ట్లు స‌మాచారం.

nimmagadda-ramesh-sensational-decision-may-shock-to-babu
nimmagadda-ramesh-sensational-decision-may-shock-to-babu

పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే.. మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ కూడా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఎస్ఈసీ తీసుకునే సంచలన నిర్ణయంతో ఏపీ మాజీ సీఎం , తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు కు షాక్ గా మార‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Nimmagadda Ramesh నిమ్మ‌గ‌డ్డ సంచ‌ల‌నం

ఏపీలో రెండవ దశ పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పోలింగ్ 3వేల 328 గ్రామపంచాయితీలకు ఎన్నికలు నోటిఫికేషన్ రాగా.. 539 సర్పంచ్‌ అభ్యర్ధులు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన 2వేల 789 గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్ పదవులకు ఈనెల 13న పోలింగ్ జరుగనుంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 2వేల 789 గ్రామ పంచాయతీలకు గాను.. 7వేల 510 మంది అభ్యర్ధులు పోటీపడుతున్నారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో మొత్తం 33వేల 570 వార్డు పదవులకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇందులో 12వేల 605 ఏకగ్రీవాలయ్యాయి. మిగతా 20వేల 965 వార్డులకు గాను 44 వేల 879 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. రెండో దశ పోలింగ్‌లో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు.

ఈ దూకుడు …

అయితే, ఓ వైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే.. మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో 75 మున్సిపాలిటీలు, 12 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలకు నోటిఫికేషన్ రావడం.. నామినేషన్లు స్వీకరణ ప్రక్రియతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్‌ కారణంలో ఎన్నికలు వాయిదా వేసింది ఎస్‌ఈసీ.. అయితే, అదే ప్రక్రియ తిరిగి ఎస్‌ఈసీ ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ కూడా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగానే.. మున్సిపల్ ఎన్నికలకు వెళ్లేందుకు ఎస్ఈసీ సిద్ధంగా ఉందని.. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే, తిరిగి ప్రారంభిస్తారా? కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలాఉండ‌గా, పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ ఏక‌గ్రీవ మంత్రంతో టీడీపీ భారీగా సీట్లు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. మ‌రి మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా అధికార పార్టీ అదే ఎత్తుగ‌డ‌తో ముందుకు సాగితే ప‌రిస్థితి ఏంట‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

author avatar
sridhar

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N