Prakash Raj: వెండితెర పై రకరకాల పాత్రలు పోషిస్తూ విలక్షణ నటుడిగా పేరు సంపాదించిన ప్రకాష్ రాజ్ నీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదానికి గురి కావడంతో చాలా ప్రమాదకరమైన దెబ్బలు తగలడంతో.. సర్జరీ నిమిత్తం ప్రకాష్ రాజ్ నీ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రకాష్ రాజ్ సౌత్ ఇండస్ట్రీలో అనేక భాషలలో తనకంటూ సపరేట్ గుర్తింపు దక్కించుకున్న నటుడు. అంతే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో త్వరలో జరగబోయే “మా” ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ కి దిగటం తెలిసిందే.
ఇప్పటికే మా అధ్యక్ష ఎన్నికలలో ప్రకాష్ రాజు మెగా కాంపౌండ్ సపోర్టుతో.. దూసుకు పోతున్నాడు. ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాక రాజకీయ పరంగా కూడా.. ప్రశ్నించే కలిగిన ప్రకాష్ రాజు సామాజికంగా అనేక సేవాకార్యక్రమాలు చేస్తూ రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని గ్రామాలను దత్తత కూడా తీసుకోవడం. ఇటువంటి తరుణంలో ప్రకాష్ రాజ్ కి గాయాలు కావడం.. హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
ఒకపక్క మధ్య ఎన్నికలు త్వరగా జరిపించాలని… ఇండస్ట్రీలో పెద్ద తరహా మనుషులు కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ప్రకాష్ రాజ్ కి గాయాలు కావడం..తో..”మా” అధ్యక్ష ఎన్నికలలో టాలీవుడ్ పెద్దలు ఏ విధం గా వ్యవహరిస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది. మామూలుగా బయట ప్రకాష్ రాజ్ కి మంచి పేరు ఉంది. తన దగ్గర పనిచేసే వారికి ఇంకా తనకి దగ్గరగా ఉండే వారి విషయాలలో చొరవ తీసుకుని వారి బాగోగులు చూసుకుంటారని చాలామంది చెబుతారు. అంతమాత్రమే కాకుండా తన దగ్గర పనిచేసే వారికి ఇళ్లు కట్టించడం ఇంకా అనేక రీతులలో వారి అవసరతలు ప్రకాష్ రాజు తీరుస్తాడని.. చెబుతారు. అటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్న నటుడికి దెబ్బలు తగలడం తో చాలామంది సౌత్ ఇండస్ట్రీలో ప్రముఖులు.. విచారం వ్యక్తం చేస్తున్నారు.