Bigg Boss Telugu 5: అర్ధరాత్రి రెస్ట్ రూంలో.. యాంకర్ రవి తో లహరి అంటూ ప్రియ కాంట్రవర్సీ కామెంట్స్..!!

Share

Bigg Boss Telugu 5: మూడవ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ హౌస్ లో మరింత అగ్గి రాజేసింది. హౌస్ లో 17 మంది ఇంటి సభ్యులు ఉండటంతో… ఎవరైతే ఇతర కంటెస్టెంట్ నామిని చేయాలనుకుంటున్నారో… వారికి సంబంధించిన గాజు గ్లాస్ ప్లేట్ పగలగొట్టాలని బిగ్ బాస్ ఆదేశాలు ఇస్తాడు. ఈ క్రమంలో మొదటగా శ్రీరామ్‌.. మానస్‌, రవిని; సిరి.. శ్వేత, లహరిని నామినేట్‌ చేశారు. మీరన్న మాట తీసుకోలేకపోయానంటూ సన్నీ.. ప్రియను నామినేట్‌ చేయగా వాటే సేఫ్‌ ప్లే అంటూ చప్పట్లు కొట్టింది. తర్వాత సన్నీ.. కాజల్‌ను నామినేట్‌ చేశాడు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ వంతు రాగా..టాస్క్ ఆడుతున్న సమయంలో తన మెడ పై కూర్చుని రూడ్ గా ప్రవర్తించింది అంటూ .. ముఖంపై కొట్టడం మాత్రమే కాక వాడు వీడు అంటూ నోరు జారింది అని సిరిని నామినేట్ చేయడం జరిగింది.

ఆ తర్వాత సెల్ఫిష్ అంటూ కాజల్ నీ… నామినేట్ చేశారు. అనంతరం..యానీ మాస్టర్‌.. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్‌ అంటూ శ్రీరామ్‌, మానస్‌లను నామినేట్‌ చేసింది. యాంకర్‌ రవి.. చిన్న చెడ్డీలు వేసుకుని ఆ దెబ్బ చూపిస్తూ ఇంత మంచి ప్లాట్‌ఫామ్‌ను వేస్ట్‌ చేసుకుంటున్నావేమో అనిపిస్తుందని, ఇప్పటికైనా గేమ్‌ ఆడంటూ జెస్సీని నామినేట్‌ చేశాడు. దీంతో రవికి చేసి తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చాడు. నేను గేమ్ ఆడుతున్నాను లో లేదో ప్రేక్షకులు చూస్తున్నారు నీకు ఒక యాంగిల్ మాత్రమే కనబడుతుంది.. అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. అదే రీతిలో గ్రూపులో కుళ్ళు జోకులు వేసుకుంటే అక్కడ కూర్చున్నే అవసరం తనకు లేదని తాను ఎటువంటి రిలేషన్ పెట్టుకోవడానికి హౌస్ లో అడుగు పెట్టలేదు అని జెస్సీ గట్టిగా చెప్పాడు. ఆతర్వాత కంటెస్టెంట్ లహరి… ప్రియా ని నామినేట్ చేశారు. తనతో ఓ ప్రియా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తోంది అని.. ఏ కారణంతో.. తనని దూరం పెడుతున్నారు ఎవరికీ అర్థం కావడం లేదని లహరి చెప్పుకొచ్చింది. దీనికి ప్రియా ఘాటుగా స్పందించింది.

ప్రియా దారుణమైన వ్యాఖ్యలు..

ఎందుకు దూరం పెడుతున్నాను అంటే…నువ్వు హౌస్‌లో అందరు అబ్బాయిలతో బిజీ కాబట్టి! అబ్బాయిలతో నీకు ఏ ప్రాబ్లమ్‌ లేదు, కానీ అమ్మాయిలతోనే అసలు ప్రాబ్లమ్‌ అని వెటకారంగా ఆన్సరిచ్చింది. ప్రియా చేసిన కామెంట్స్ అవసరమా ఒక్కసారిగా అగ్గి రాజేసింది. హౌస్ లో అబ్బాయిలతో లహరి బిజీ అంటూ.. ప్రియా కామెంట్లు చేయటం.. మిగతా ఇంటి సభ్యులకు షాక్ కి గురి చేసింది. తరువాత లహరి శ్రీ రామ్ నీ నామినేట్ చేయడం జరిగింది. లోబో.. ప్రియాంక సింగ్‌, శ్రీరామ్‌ను; ప్రియాంక సింగ్‌.. లోబో, జశ్వంత్‌ను; మానస్‌.. శ్రీరామ్‌, రవిని నామినేట్‌ చేశారు. అనంతరం ప్రియా వంతు రాగా.. లహరి ని నామినేట్ చేస్తూ.. హౌస్ లో అబ్బాయిల తోనే ఎక్కువ టైం గడుపుతోంది అమ్మాయిలతో కాదండి మళ్లీ అదే కారణం నొక్కి చెప్పింది. అంత మాత్రమే కాక తన ఆరోగ్యం బాగా లేని టైంలో… లహరి వస్తుందేమోనని వెయిట్ చేశాను కానీ ఆమె రాలేదు అని పేర్కొంది.

ప్రియా పై రవి సీరియస్..

అర్ధరాత్రి రెస్ట్ రూమ్ లో.. రవికి.. లహరి హగ్ ఇవ్వటం జరిగిందని .. మరి ఏ ఉద్దేశంతో అర్ధరాత్రి సమయంలో.. అందరూ పడుకున్న టైములో.. ఆ హాగ్ ఏంటో అర్థం కాలేదంటూ ప్రియా నోటికొచ్చినట్లు మాట్లాడటం తో ఒక్కసారిగా రవి.. లహరి.. చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. జాతీయ మీడియాలో మాట్లాడుతున్నారన్న విషయం మర్చిపోకండి అని మండిపడ్డారు. రవి బ్రదర్‌ బర్త్‌డే కోసం షర్ట్‌ పంపించమని కెమెరాల దగ్గర రిక్వెస్ట్‌ చేశానని, అతడు తనకు బ్రో మాత్రమేనంటూ ఏడ్చేసింది లహరి. తర్వాత రవి మాట్లాడుతూ.. మిడ్‌నైట్‌ హగ్గు అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్‌ అని అడిగాడు. నేను లహరి కంటే సిరి, కాజల్‌తో ఎక్కువగా ఉంటాను, అప్పుడు లేని సమస్య లహరి దగ్గరకు వచ్చేసరికి ఎందుకు వస్తుంది? మమ్మల్ని అందరినీ దోషులుగా చూపిస్తున్నావు అని కడిగి పారేశాడు.

Bigg Boss 5 Telugu: Priya Shocking Comments On Lahari Shari - Sakshi

ఈ క్రమంలో ఆమె సింగిల్ అంటూ ఆమె క్యారెక్టర్ దెబ్బతీసేలా ప్రియా కామెంట్ చేయడంతో.. మరోసారి తన గురించి మాట్లాడకూడదు అంటూ లహరి ప్రియా ని గట్టిగా నామినేట్ చేయడం జరిగింది. ఇదే తరుణంలో నాకు ఫ్యామిలీ ఉంది నీకు ఫ్యామిలీ ఉంది ఇటువంటి రాంగ్ స్టేట్మెంట్ లు . ఇవ్వకూడదు అంటూ రవి.. ప్రియా పై మండిపడ్డారు. అనంతరం ప్రియా సన్నీ ని నామినేట్ చేయగా…సన్నీ.. ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడండి, ఒక మనిషికి హగ్గిస్తే బూతు కాదని.. చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే హౌస్ లో తాను బెడ్ పై కూర్చుని టైంలో ఇష్టానుసారంగా సన్నిని  ఒక టైంలో మాట్లాడారని.. నామినేషన్ వేసిన టైంలో చెప్పగా తన ఫ్రెండ్స్ తో అలాగే ఉంటాను అంటూ సన్నీ బదులిచ్చాడు. ఈ క్రమంలో ప్రియా చేసిన వ్యాఖ్యలు హౌస్ లో.. అగ్గిరాజు చేయగా మిగతా ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ఈ రోజు ఎపిసోడ్ లో.. కంటిన్యూ కానుంది.


Share

Related posts

గంజాయి కి కేరాఫ్ అడ్రస్ గా మారిన తెలుగు రాష్ట్రాలు..! ఆ రెండు నగరాలే ప్రధానం…

siddhu

చిరంజీవి ఆచార్య : బెంగపెట్టుకున్న మెగా ఫాన్స్ .. కొరటాల శివ కి ఒకే ఒక్క ప్రశ్న వేస్తున్నారు..!

GRK

Ys Jagan Mohan Reddy : మధ్యతరగతి ప్రజలపై భారం దించడానికి జగన్ సరికొత్త ఐడియా..!!

sekhar