Radhe Syam Review: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా ఈ రోజు విడుదల అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఎలా ఉంది.. ఆ సినిమా బడ్జెట్ దాదాపు రూ.350 కోట్లు ఖర్చు పెట్టారు. అంత భారీ బడ్జెట్ కు న్యాయం చేసిందా.. కథ ఏమిటి..ఫలితం ఎలా ఉండబోతున్నది..అనేది ఇప్పుడు పరిశీలిద్దాం…హీరో క్యారెక్టర్ పేరు విక్రమాదిత్య. ఆయన ప్రపంచంలోని ఏ ఒక్కరికీ లేని ప్రత్యేకత ఉంటుంది. అది ఏమిటంటే.. ఆయన చేయి చూసి భవిష్యత్తు చెప్పగలడు. గతంలో ఏమి జరిగిందో చెప్పగలడు. భవిష్యత్తులో జరగబోయేది చెప్పగలడు. చాలా ఈజీగా చెబుతారు. ఆయన చెప్పేది తప్పు అవ్వదు. కాకపోతే జరగబోయేది తెలుసుకుని భయపడుతూ ఉండకుండా మన ఫేట్ మనమే మార్చుకోవాలి. చేతి రాతలు చెరపడం చేతకాదు అని ఒదిలివేయకుండా మనం మార్చుకోవచ్చు అన్న మంచి కాన్సెప్ట్ మీద సినిమా తీశారు. దానికి లవ్ ట్రాక్ కాస్త యటాచ్ చేశారు. హీరోయిన్ కు ఒక జబ్బు (వ్యాధి) ఉంటుంది. ఆమె చనిపోతుంది అన్నది ట్విస్ట్. హీరో భవిష్యత్తు ప్రకారం ఆయన భవిష్యత్తు చూసుకుంటే చనిపోతాడు అని ఉంటుంది. సో.. వీళ్లు ఇద్దరూ చనిపోతారా.. బతుకుతారా..కలుస్తారా లేదా అనేది కథ.
Radhe Syam Review: ప్యూర్ లవ్ స్టోరీ
హీరో, హీరోయిన్ ల సెలక్షన్ విషయానికి వస్తే.. ఈ సినిమా వంద శాతం(ప్యూర్) లవ్ స్టోరీ. ముందుగా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రీచ్ హాలివుడ్ లెవెల్ లో ఫ్రేమ్స్ ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ కూడా హలీవుడ్ లెవెల్ లో ఉంది. ప్రతిదీ కూడా హైలీ రీచ్ లుక్. బెస్ట్ సినిమాటోగ్రఫీ. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటువంటి లొకేషన్ లు, స్క్రీన్ లు రాలేదు. అటువంటి ఫ్రేమ్ తో చాలా బాగుంది. అయితే అంత మంచి రిచ్ స్క్రీన్ మీద ప్రభాస్ లాంటి ఫేస్ ఆనలేదు. ఆ లవ్ స్టోరీకి, ఆ స్క్రీన్ కు, ఆ ఫ్రేమ్ కి, ఆ లొకేషన్ కు, రీచ్ లుక్ కు ప్రభాస్ ఫేస్ సరిపోలేదు. లవర్ బాయ్ ఇమేజ్ లేదు. అయితే జోతిష్యం బాగా చెప్పగలడు అన్న కేరెక్టర్ కు సరిపోతాడు. కానీ ప్యూర్ లవ్ స్టోరీ కాబట్టి ఆ ఇమేజ్ లేదు. హీరో సెలక్షన్ రాంగ్ ఏమో అన్న భావన ప్రేక్షకుల నుండి వ్యక్తం అవుతోంది. పూజా హెగ్డే అంటే బోర్ కొట్టేసింది. ఇటువంటి లవ్ స్టోరీకి ఫ్రెష్ లుక్ హీరోయిన్ ఎవరైనా ఉంటే బాగుండేది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Radhe Syam Review: 350కోట్లు ఖర్చు పెట్టి..
మొత్తానికి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే ఉంది. యాక్టింగ్ బాగుంది. ఇద్దరూ సీనియర్ కాబట్టి బాగానే యాక్ట్ చేశారు. ప్రీ క్లైమాక్స్ వరకూ సెకండ్ ఆఫ్ కొంత బోర్ అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫరవాలేదు. అసలు సినిమా బాగుందా లేదా అనేది చెప్పాలి అంటే సినిమాలో హీరో హీరోయిన్లు వాళ్ల పాత్రలకు వాళ్లు బాగానే చేసినప్పటికీ వాళ్ల సెలక్షన్ బాగోలేదు. ఈ స్టోరీకి వాళ్లు కరెక్ట్ కాదు. ఈ కథకు రూ.350 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ గా కథ. ఈ కథకు భారీ తారాగణాన్ని పెద్ద స్టార్ హీరోను పెట్టేసి ఆయనకే 80 కోట్లో 90 కోట్లో బడ్జెట్ ఇచ్చి సినిమా మొత్తానికి ఆ లోకేషన్ ల కోసం, ఫ్రేమ్ ల కోసం ఆ రీచ్ ల కోసం వంద కోట్లు ఖర్చు పెట్టి, మిలిగిన రెమ్యునరేషన్ మొత్తం రూ.50 కోట్లు ఇచ్చి మొత్తం మీద రూ,350కోట్లు ఖర్చు పెట్టి ఇటువంటి స్టోరీలు తీయడం అనవసరం. ఇది చాలా చిన్న స్టోరీ. రూ. 60 కోట్లో, 70 కోట్లతోనే ఒ చిన్న హీరోను పెడితేే కొంచెం హిట్ అయ్యేది. పెట్టిన పెట్టుబడికి అదనంగా 25 శాతం కలెక్షన్ వచ్చేది. కానీ ఇంత భారీ బడ్జెట్ కి ఇంత చిన్న కథతో ఇంత తారాగణంతో తీయాల్సిన అవసరం లేదు. మొత్తానికి సినిమా బిలో యావరేజ్, యావరేజ్ వరకూ ఉంటుంది. అంతకు మించి బాగా భీభత్సంగా వెళ్లదు. మరో విషయం ఏమిటంటే డైలాగ్ లు అంత ఇంప్రెసివ్ గా లేవు. ఫైట్స్ లేవు. కామెడీ లేదు. ఎంటర్ టైన్ మెంట్, మాస్ మసలా ఊహించి ఎవరు వెళ్లవద్దు. ఫ్యూర్ లవ్ స్టోరీ చూడాలంటే వెళ్లండి. ఆ లవ్ స్టోరీ కూడా గీతాంజలి. టైటానిక్ ఈ రెండు సినిమాలు చూసిన వాళ్లు సెకండ్ ఆఫ్ బోర్ అనిపిస్తుంది. సినిమాలో కొత్తదనం అయితే లేదు.