Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి “RRR” ప్రాజెక్టుకు సంబంధించి క్లైమాక్స్ పనులు చూసుకుంటున్నారు. అక్టోబర్ మాసంలో రిలీజ్ కాబోయే ఈ సినిమా తరువాత రాజమౌళి మహేష్ బాబు తో చేయబోయే ప్రాజెక్టుకు సంబంధించి పనులు స్టార్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు తో చేయబోయే సినిమాని “బాహుబలి” తో పోల్చొద్దు అని ముందే తెలపడం జరిగింది.
అయితే ఈ సినిమాకి స్టోరీ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో స్టోరీ ఉంటుందని అంటున్నారు. ఇటువంటి తరుణంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో సరికొత్త ట్విస్ట్ ఇచ్చే న్యూస్ సోషల్ మీడియాలో వినబడుతోంది. విషయంలోకి వెళితే మహేష్ బాబు తో రాజమౌళి చేయబోయే సినిమాలో మరో బాలీవుడ్ స్టార్హీరో ఉంటారని.. పాన్ ఇండియా నేపథ్యంలో.. ఈ సినిమా షూటింగ్ జరగనున్న ఈ క్రమంలో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
మహేష్ తో పాటు సదరు బాలీవుడ్ హీరో పాత్ర కూడా సరిపోయేలా స్టోరీ ఉంటుందని.. లేటెస్ట్ టాక్. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా డాట్ చేయనున్నారు. ఆ తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ మహేష్ స్టార్ చేయనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా వచ్చే ఏడాది లో “సర్కారు వారి పాట” స్టార్టింగ్ లో రిలీజ్.. కాగా తర్వాత త్రివిక్రమ్ సినిమా తో పాటు రాజమౌళి సినిమా కూడా మహేష్ చేయనున్నట్లు సమాచారం.