Raviteja : గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమాతో భారీ హిట్ ను సొంతం చేసుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈ సంక్రాంతికి సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. మూడేళ్ళ మంచి కం బ్యాక్ హిట్ అందుకున్న రవితేజ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ సినిమా ఇచ్చిన కిక్ తో తన నెక్స్ట్ సినిమాను కూడా ట్రాక్ మీదకి తెచ్చాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అన్న సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
సీనియర్ హీరో అర్జున్ విలన్ గా నటుస్తున్నాడు. అనసూయ భరద్వాజ్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. హావీష్ ప్రొడక్షన్స్, బాలీవుడ్ కు చెందిన పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన ఓ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఇంతక ముందు రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ వీర అన్న సినిమా చేసాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడు ఖిలాడితో ఎలాగైనా హిట్ కొట్టాలని కసి మీద ఉన్నాడు రమేష్ వర్మ.
Raviteja : రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ సాగుతోంది.
రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ సాగుతోంది. ఇక ఇప్పటికే ఖిలాడి రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. మే 28న భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. కాగా ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ ఇటలీ లో ఉందట. తాజాగా ఇటలీలో రవితేజ చిల్లౌట్ అవుతున్న పిక్ ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఇటలీలో భారీ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ వెళ్ళినట్టు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత త్రినాథ రావు నక్కిన దర్శకత్వలో రవితేజ ఒక సినిమా చేయబోతున్నాడు.