Salman Khan’s Ex Lover : 1990 కాలంనాటి బాలీవుడ్ యాక్ట్రెస్, సల్మాన్ ఖాన్ (Salman Khan) మాజీ గర్ల్‌ఫ్రెండ్ సోమీ అలీ (Somy Ali) తాజాగా ఒక సంచలన పోస్ట్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఒక వ్యక్తి నిజస్వరూపం, బండారం త్వరలోనే బట్టబయలు కాబోతోంది అంటూ ఆమె పేర్కొంది. ‘హార్వే వైన్‌స్టీన్ ఆఫ్ బాలీవుడ్’ అని పరోక్షంగా ఒక బాలీవుడ్ సెలబ్రిటీని ఈమె టార్గెట్ చేస్తోంది. హార్వే వైన్‌స్టీన్ ఒక అమెరికన్ మాజీ సినీ నిర్మాత. అంతేకాదు ఇతను చాలా రేప్స్, లైంగిక దాడిల్లో దోషిగా తేలిన ఒక నేరస్థుడు. అయితే ఇలాంటి కామాంధుడు బాలీవుడ్ లో ఉన్నారా??? ఉంటే అది ఎవరా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
Salman khan : సల్మాన్ ఖాన్‌తో మైత్రీ మూవీస్..హిందీలో జనతా గ్యారేజ్ రీమేక్..!
Salman Khan’s Ex Lover : పోస్ట్ లో ఐశ్వర్యరాయ్ ప్రస్తావన
సోమీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులో ఐశ్వర్యారాయ్ పేరును కూడా ప్రస్తావించింది. “హార్వే వైన్‌స్టీన్ ఆఫ్ బాలీవుడ్! మీ బండారం, చీకటి కోణాలు త్వరలోనే బట్టబయలు, బహిర్గతం అవుతాయి. మీరు వేధించిన మహిళలు ఏదో ఒక రోజు బయటకు వచ్చి ఎవరికీ తెలియని నిజాలను పంచుకుంటారు. ఐశ్వర్యరాయ్ లాగానే” అని సోమీ పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది. స్టిల్ సిల్హౌట్ స్టిల్‌ను షేర్ చేస్తూ వేధింపులకు గురైన అమ్మాయిలు ఐశ్వర్యరాయ్ మాదిరిగానే తమ స్టోరీస్ షేర్ చేస్తారని సోమీ తెలిపింది.
Chiranjeevi: చిరంజీవితో సల్మాన్ ఖాన్ .. అబ్బబ్బ ఇలాంటి సినిమా సీన్ ఇండియన్ చరిత్రలో మళ్ళీ రాదు !
అప్పుడే మొదలైన అనుమానాలు
సోమీ తన పోస్ట్ కామెంట్స్ సెక్షన్ ని ఆఫ్ చేసింది. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏమిటంటే… ఆమె పోస్ట్‌లో కనిపించిన సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ స్టిల్. ఈ స్టిల్ ‘మైనే ప్యార్ కియా’ మూవీలోని ‘ఆతే జాతే హస్తే గాతే’ పాటలోని ఉంటుంది. ఈ స్టిల్ లో మగవ్యక్తి సల్మాన్ ఖాన్ అయితే.. లేడీ యాక్ట్రెస్ భాగ్యశ్రీ. అయితే సోమీ ఆ ఫొటోనే ఎందుకు పోస్ట్ చేసింది?? ఆ ఫొటోకి పోస్ట్ లోకి మేటర్ కి ఉన్న ఇంటర్-లింక్ ఏంటి అని బాలీవుడ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.