Samantha: సమంత..ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మరింది. ఆమె సినిమాకౌ సంబంధించిన న్యూస్ అయినా, వ్యక్తిగతానికి సంబంధించిన న్యూస్ అయినా ఇలా వైరల్ అవుతోంది. ఆమె ఎవరితో కనిపించినా రక రకాల వార్తలు పుట్టేస్తున్నాయి. ఏ సినిమా ప్రకటించినా ఇది అందుకోసమేనా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగ చైతన్యతో విడిపోయాక సమంత మారిందా, సమంతపై అభిప్రాయాలు మారాయా అనే విషయం కాస్త కన్ఫ్యూషన్ను క్రియేట్ చేస్తోంది. కానీ, సమంత మాత్రం ఏ డెసిషన్ తీసుకున్నా చాలా క్లారిటీతో తీసుకుంటోందని అర్థమవుతోంది.
సౌత్‌లో రెండు ప్రాజెక్ట్స్ కమిటయిన సమంత ఆ రెండు ప్రాజెక్ట్స్‌ను సమ్మర్ లోపు కంప్లీట్ చేయనుంది. ఆ తర్వాత ఫోకస్ మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీపై పెట్టబోతోందనేది లేటెస్ట్ న్యూస్. ముఖ్యంగా బాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ కంపెనీలో చైన్ ప్రాజెక్ట్స్‌కు సైన్ చేయబోతోందని ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఒకటి వైరల్ అవుతోంది. ఆ సంస్థలో నాలుగు సినిమాలకి సైన్ చేయనుందని సమాచారం. అలాగే తాప్సీ నిర్మాణంలో ఓ సినిమాను త్వరలో ప్రకటించనుందట. అంతేకాదు ఆమెకు బాలీవుడ్లో డెబ్యూ వెబ్ సిరీస్‌తో లైఫ్ ఇచ్చిన దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే నిర్మాణంలో మరో వెబ్ సిరీస్, ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాను చేయబోతోందని వార్తలు వస్తున్నాయి.
Samantha: బాలీవుడ్లో ఏడెనిమిది ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటుందని తెలుస్తోంది.
ఇలా బాలీవుడ్లో ఏడెనిమిది ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటుందని తెలుస్తోంది. ఇక తమిళంలో కొత్తగా కమిటయిన సినిమాలంటే అవే తెలుగులోనూ చేస్తోంది. ఆ రెండు సినిమాలనే సమ్మర్ వరకు పూర్తి చేయనుంది. ఇక హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఏడాది నుంచి సమంత సౌత్ సినిమాలలో కనిపించే అవకాశాలు దాదాపు ఉండవనే సంకేతాలు వస్తున్నాయి. అయితే పెద్ద సినిమా ..పెద్ద హీరో అయితేనో..స్పెషల్ రోల్ అయితేనో తప్ప ఇక్కడ సినిమాలకు సైన్ చేసే ఆలోచనలో సామ్ లేదని టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజమో చూడాలి.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!