తెలుగు బుల్లితెరలో కార్తీకదీపం సీరియల్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సీరియల్ లోని డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ అలియాస్ నిరుపం పాత్రకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక సీరియల్ లో డాక్టర్ బాబు ఎంత సీరియస్ గా ఉంటాడో బయట అంతే సరదాగా ఉంటాడు సోషల్ మీడియాలో నిరుపం చాలా యాక్టివ్ గా ఉంటాడు.
ఇక ఈ సీరియల్ లో నటించే ఇద్దరు చిన్నపిల్లలు హిమ, సౌర్య క్యారెక్టర్లు సినిమాలలో కూడా ఆఫర్లు కొట్టేశారు. షూటింగ్ గ్యాప్ లో డాక్టర్ బాబు ఇద్దరు చిన్న పిల్లలు కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక తాజాగా ఈ పిల్లలు తన ప్రాణం తీసేస్తున్నారు అంటూ నిరుపం తన బాధను చెప్పుకున్నాడు. తాజాగా డాక్టర్ బాబు వంటలక్క ను వదిలేసి తన ఇద్దరు కూతుర్లు అయినా హిమ, శౌర్య తో కలిసి డ్యాన్స్ చేశాడు.
కాటుక కనులే అంటూ ఆన్ స్క్రీన్ కూతుర్లతో కలిసి క్యూట్ స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. డాక్టర్ బాబు దుమ్ములేపేశాడు అని నెటిజన్ల దగ్గర నుండి కామెంట్లు వస్తున్నాయి. ఇక వంటలక్క అలియాస్ దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ ను వదిలేసి కూతుళ్లతో కలిసి డాక్టర్ బాబు హంగామా చేయడం కొద్దిగా ఆశ్చర్యం కలిగించింది అని చెప్పాలి.
https://www.instagram.com/reel/CJp1DkYClsh/?utm_source=ig_embed