Shanmukh: కవర్ సాంగ్స్ డాన్సర్ నేడు సెలిబ్రిటీ అయ్యాడు అంటే అంతా బిగ్‌బాస్ షో పుణ్యమే. అయితే ఇక్కడే వుంది అసలు చిక్కు. ఇదే షో అతనికి మంచి పేరుతో పాటుగా చెడ్డ పేరు కూడా తీసుకు వచ్చింది. అతడే యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్. షన్ను తనదైన ఆట తీరుతో బిగ్‌బాస్ 5వ సీజన్లో చివరకు నిలిచి, రన్నరఫ్‌గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో తన ప్రేయసితో విడిపోవడానికి ఈ షో కారణమైంది. అదెలాగో అందరికీ తెలిసిందే.
Siri-shamukh: సిరి, షణ్ముఖ్ సహజీవనం.. కోడై కూస్తున్న సోషల్ మీడియా?
Shanmukh: షన్ను vs దీప్తి:
సోషల్ మీడియాలో క్యూట్ పెయిర్‌గా పేరు సంపాదించుకున్న దీప్తి సునైనా, షణ్ముఖ్ గతేడాదిలో విడిపోవడం తెలిసినదే. దీంతో ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నారు. అలాగే ఎవరి కెరీర్పైన వాళ్ళు దృష్టి పెట్టారు. వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయని, ఇద్దరు బయట చెబుతున్నమాట తెలిసినదే. షన్ను ప్రస్తుతం డైరెక్టర్ పండుతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా షణ్ముఖ్ తన ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Deepti-shanmukh: దీప్తి సునైనాకి షణ్ముఖ్ చివరాఖరి ముద్దు.. తట్టుకోలేని వాళ్ళు ఈ వార్త చదవకండి!
షన్ను తాజా వీడియో ఇదే:
షన్ను తాజాగా విజయ్ నటించిన ‘బీస్ట్” మూవీలోని ‘హళమితి హబిబో’ పాటకు హీరోయిన్ ‘నువేక్ష’తో కలిసి స్టెప్పులేశాడు. అచ్చం విజయ్ మాదిరే స్టెప్పు లేసిన షన్ను డాన్సుని సోషల్ మీడియాలో తెగ చూసేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన షన్నూ అభిమానులు.. రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చేసింది’ (శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలో లవ్ ఫెయిల్ అయిన వ్యక్తిని ఓ పాట రూపంలో ఓదార్చుతూ.. చిరంజీవి ఈ డైలాగ్ చెప్తాడు) అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.’