Shanmukh Jaswanth : షణ్ముఖ్ జస్వంత్ Shanmukh Jaswanth తెలుసు కదా. ఆయన సోషల్ మీడియా స్టార్. యూట్యూబ్ కింగ్. సోషల్ మీడియాలో షణ్ముఖ్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ మధ్య టీవీ షోలలోనూ మెరుస్తున్నాడు షణ్ముఖ్. ఇటీవల హైదరాబాద్ లో మద్యం మత్తులో తన కారుతో వేరే వాహనాలను ఢీకొట్టాడంటూ… షణ్ముఖ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దానిపై పలు రకాల వాదనలు వినవచ్చాయి.

షణ్ముఖ్ కు ఉన్న ఫేమ్ ను తగ్గించడానికే ఇలా షణ్ముఖ్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ తన అభిమానులు వాపోయారు.
సరే.. అది అటుంచితే.. తాజాగా షణ్ముఖ్.. సూర్య వెబ్ సిరీస్ లేటెస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది. ఇప్పటికే సూర్య రెండు ఎపిసోడ్స్ రిలీజ్ అయి సూపర్ సక్సెస్ అయ్యాయి. తాజాగా.. విడుదలైన సూర్య మూడో ఎపిసోడ్.. ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేస్తోంది. యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది.
Shanmukh Jaswanth : సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ తో ఫేమస్ అయిన షణ్ముఖ్
అయితే.. షణ్ముఖ్ జస్వంత్.. సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ తో ఫేమస్ అయ్యాడు. అప్పటి వరకు చాలామందికి షణ్ముఖ్ గురించి తెలియదు కానీ.. సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ తో మనోడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజాగా సూర్య వెబ్ సిరీస్ ను తీస్తున్నాడు. సూర్య వెబ్ సిరీస్ కూడా సూపర్ సక్సెస్ అయింది.
ఇంజనీరింగ్ పూర్తి చేసి.. జాబ్ కోసం తిరుగుతూ.. ఖాళీగా ఉండే.. ఓ మధ్య తరగతి కుర్రాడి పాత్రలో నటించాడు షణ్ముఖ్. మధ్య తరగతి కుర్రాడిగా షణ్ముఖ్ నటన హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఇక.. తనకు ఉన్న ఫాలోయింగ్ ఎంతో చెప్పడానికి.. మూడో ఎపిసోడ్ సృష్టిస్తున్న సంచలనాల గురించి చెప్పుకోవచ్చు.
ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే సూర్య వెబ్ సిరీస్.. మూడో ఎపిసోడ్ ను చూసేయండి మరి.