Shanmukh Jaswanth : బిగ్బాస్ షోలో పార్టిసిపేట్ చేసి షణ్ముఖ్ జశ్వంత్ తన ఇమేజ్ను పాడు చేసుకున్నాడు. ఎంతలా అంటే ప్రాణంగా ప్రేమించిన దీప్తి కూడా అతన్ని ఛీ కొట్టి బ్రేకప్ చెప్పేసింది. వ్యక్తిగత విషయాల్లో ఇప్పుడు షన్ను అన్ని చేదు అనుభవాల్ని ఎదుర్కోవలసి వస్తోంది. అయితే తాజాగా షణ్ముఖ్ గుండె పగిలే న్యూస్ ఒకటి ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. దీన్ని చూసిన దీప్తి సునైనా రియాక్షన్ ఏంటంటే?
Shanmukh Jaswanth : దీప్తి సునైనా రియాక్షన్ రియాక్షన్ ఏంటి ?
బిగ్బాస్ సీజన్ 5 ప్రారంభమైన సమయం నుంచి షన్నుకు బాగా సపోర్ట్ చేసింది దీప్తి సునైనా. కానీ చివరికి ఆమె భారీ ట్విస్ట్ ఇచ్చింది. బిగ్బాస్ హౌస్ లో నుంచి బయటికి వచ్చాక అసలు అతన్ని దీప్తి కలవను కూడా కలవలేదు. ఈ విషయాన్ని లైవ్ లో చెబుతూ వాపోయాడు షణ్ముఖ్. మొత్తానికి ప్రేమ మళ్లీ చిగురించలేనంతగా చెడింది. ఈ నేపథ్యంలో షణ్ముఖ్ తన కెరీర్ పై దృష్టి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా అతడు ఇన్ స్టా స్టోరీ ద్వారా ఒక ఫొటో అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫొటోలో అతని పాదం గాయాలతో చాలా దారుణంగా కనిపిస్తోంది. ఈ పోస్టుకు “స్వీట్ అండ్ రాడ్ మెమరీ” అని ఒక క్యాప్షన్ జోడించాడు. అయితే ఈ గాయం ఎప్పుడు తగిలిందో స్పష్టత లేదు. దీనిపై దీప్తి సునైనా స్నేహితుల వద్ద స్పందించినట్టు తెలుస్తోంది.
ఆ న్యూస్ తెలియగానే
నిజానికి దీప్తి సునైనా షణ్ముఖ్ గురించి అసలు పట్టించుకోవడం. పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినా ఆమె అతన్ని గుడ్డు మీద ఈకలా తీసేసింది. తన జీవితంలో అతడు ఉన్నాడా? అని అడిగితే ఆమె నిస్సందేహంగా లేడని చెప్పేటట్లే ఉంది. షన్నుని ఈ విధంగా ఆమె ఇగ్నోర్ చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తోంది. అయితే షన్ను గాయం గురించి ఆమె ఆరా తీసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.