Megastar: మెగాస్టార్ – త్రివిక్రమ్ కాంబోను సెట్ చేసే ప్రయత్నాలలో స్టార్ ప్రొడ్యూసర్..?

Share

Megastar: మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుసగా యంగ్ డైరెక్టర్స్‌కు అవకాశాలిస్తూ సర్‌ప్రైజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య మెగా మల్టీస్టారర్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మణిశర్మ సంగీత దర్శకుడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. దీని తర్వాత మెగాస్టార్ మూడు సినిమాలతో రాబోతున్నారు. ఆ సినిమాలన్ని ఇప్పుడు సెట్స్ మీదున్నాయి.

star producer is planning to set megastar-trivikram combo
star producer is planning to set megastar-trivikram combo

మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తైనట్టు సమాచారం. ఈ సినిమాను మలయాళ సూపర్ హిట్ సినిమా లూసీఫర్‌కు తెలుగు అఫీషియల్ రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. అలాగే మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తైంది. ఓ భారీ ఫైట్, ఓ సాంగ్‌ను కంప్లీట్ చేశారు. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది. తమన్నా హీరోయిన్‌గా, కీర్తి సురేశ్ కీలక పాత్రలో కనిపించబోతోంది.

Megastar: అందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

ఇక బాబీ దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్‌టైనర్‌ను చేస్తున్నారు చిరు. ఇందులో ఆయనకు తమ్ముడిగా మాస్ మహారాజ రవితేజ నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మరో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుమలకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ఇదే స్టార్ ప్రొడ్యూసర్ మెగాస్టార్ – త్రివిక్రమ్ కాంబోను సెట్ చేసే ప్రయత్నాలలో ఉన్నారట. అందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ – మహేశ్ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా సెట్స్ మీదకు రావాల్సి ఉంది. మరి త్రివిక్రమ్ – మెగాస్టార్ కాంబోలో మూవీ ఎప్పుడు అఫీషియల్ కన్‌ఫర్మేషన్ వస్తుందో చూడాలి.


Share

Related posts

రాజకీయాల్లో చిరంజీవి ఫార్ములా వాడుతున్న పవన్ కళ్యాణ్..??

sekhar

AP Municipal Elections: మూడు మున్సిపాలిటీలపై టీడీపీ స్పెషల్ ఫోకస్..! వైసీపీ ఓడిపోతే వారి మంత్రి పదవులకు ఎసరు..! వైసీపీ ప్రతిష్టాత్మక పోరు..!!

Srinivas Manem

బిగ్ బాస్ లో నటించిన దివి… పవన్ కళ్యాణ్ సరసన నటించనున్నదా??

Naina