దేశంలోనే టాప్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’. తెలుగులో రియాల్టీ షో మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటి మూడు సీజన్లు అతి పెద్ద హిట్ అయి స్టార్ మా ఛానల్ కు భారీ టిఆర్పి రేటింగ్ లు తీసుకొని వచ్చాయి.
ఇక ఈ సీజన్లన్నీ ఒకదానికి మించి ఒకటి హిట్ అయిన తర్వాత ఈ బిగ్ బాస్ షో సీజన్ 4 మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది. ఇప్పటికే దానికి సంబంధించిన సన్నాహాలు అన్ని చివరిదశకు వచ్చేశాయి. నాగార్జునే ఈ సీజన్ కు కూడా హోస్ట్ గా చేస్తున్నారు.నాగ్ ప్రోమో కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 16 నుంచి బిగ్ బాస్ సీజన్ 4 మొదలవుతుందని చెబుతున్నారు.
బిగ్ బాస్ సీజన్ 4 కోసం మొదట 30 మందిని సెలెక్ట్ చేసి వారి నుండి 16 మందిని షార్ట్ లిఫ్ట్ చేసి చివరికి వారందరినీ ఫైనల్ చేసిన వారందరినీ క్వారంటైన్ లో ఉంచిన్నట్లు సమాచారం. వారికి కరోనా టెస్టులు చేయించి 16 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచారు. షో మొదలయ్యే ముందు కూడా ఒకసారి పరీక్షలు చేస్తారని తెలుస్తోంది.16వ తేదీన నాగార్జున ప్రజల అందరి ముందుకు వచ్చి స్వయంగా వారి పేర్లను అనౌన్స్ చేసి షో మొదలుపెడతారు.
బిగ్ బాస్ సీజన్ 4 హౌస్ లోపల కూడా కరోనా నిబంధనలకు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో 50 రోజులకు మాత్రమే షో ను కుదించారు.ఇక షో నిర్వహించే ఫార్మాట్, గేమ్ లు, టాస్క్ లు మొత్తంలో కూడా మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. అన్నీ సామాజిక దూరం పాటించేలా ఉంటాయని చెబుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 కి సంబంధించిన మరింత సమాచారం మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది.