Tamannaah: తమన్నాTamannaah టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యంగ్ హీరోల దగ్గర నుంచి, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ప్రభాస్ వరకు దాదాపు అందరి హీరోల కి జంటగా తమన్నా నటించి భారీ సక్సస్ లను అందుకుంది.
ఈ క్రమంలోనే దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ సినిమా బాహుబలి 1 అండ్ 2 లలో నటించింది. ఈ సినిమాలలో భాగమవడం నిజంగా తమన్నా అదృష్టం అని చెప్పాలి. అంతేకాదు మెగాస్టార్ తో కలిసి సైరా నరసింహ రెడ్డి సినిమాలో కూడా సెకండ్ లీడ్ లో కనిపించింది.
అయితే పూజా హెగ్డే, రష్మిక మందన్నలు రావడం తో తమన్నా జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. లేదంటే ఈ మిల్కీ బ్యూటీ చేతి నిండా బోలెడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉండేవి. అలా అని మరీ ఖాళీగా కూడా లేదు. చేతిలో ప్రస్తుతం మంచి ప్రాజెక్టే ఉన్నాయి. యంగ్ హీరో సత్యదేవ్ కి జంటగా గుర్తుందా శీతాకాలం అన్న సినిమా చేస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ లుక్ కి ప్రేక్షకులనుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. అలాగే నితిన్ నటిస్తున్న బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా అంధాదున్ తెలుగు రీమేక్ లో కీలక పాత్ర పోషిస్తోంది.
Tamannaah : బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ముఖ్ నిర్మాతగా తమన్నా కామెడీ సినిమా..!
ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటష్ నటిస్తుండగా హిందీలో టబు చేసిన పాత్రలో తమన్నా కనిపించబోతోంది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్ 3 లో విక్టరీ వెంకటేష్ జంటగా నటిస్తోంది. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్న సీటీమార్ సినిమాలో కూడా తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
ఇలా వరసగా సినిమాలు చేస్తున్న తమన్నా ఇప్పుడు బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ముఖ్ నిర్మాతగా మారి ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇందులో తమన్నాను హీరోయిన్ గా ఎంపికచేసినట్టు సమాచారం. ఈ సినిమా కామెడీ ప్రధానంగా తెరకెక్కబోతుండగా ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తోంది.