NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యేల తిరుగుబాటుపై తనదైన శైలిలో స్పందించిన మంత్రి మల్లారెడ్డి .. ఇవి అన్నతమ్ముల మధ్య కుటుంబ గొడవలు లాంటి వంటూ..

మేడ్చల్ జిల్లాకు చెందిన పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యే లు మంత్రి మల్లారెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే మైనంపాటి హనుమంతరావు నివాసంలో నిన్న ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, వివేక్ గౌడ్, మాధవరం కృష్ణారావు, బి సుభాష్ రెడ్డి భేటీ అవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. జిల్లాలో మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష నిర్ణయాలపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశాలపై మంత్రి కేటిాఆర్, సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకువస్తామని వారు ప్రకటించారు. ఎమ్మెల్యేలు అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేసిన నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి తన దైన శైలిలో స్పందించారు.

Telangana Minister Malla Reddy Reacts on MLAs Meeting in Mynampally Hanumanta rao Residence

 

ఇవి అన్నతమ్ముల మధ్య కుటుంబ గొడవలు లాంటివనీ, మీడియా వీటిని పెద్దవిగా చూపాల్సిన అవసరం లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మా కుటుంబ పెద్ద వీటిని పరిష్కరిస్తారని చెప్పుకొచ్చారు. పదవులు ఇచ్చేది కేసిఆర్, కేటిఆర్ తప్ప తాను కాదని మల్లారెడ్డి పేర్కొన్నారు. తాను గాంధేయవాదినని, ఎవరితోనూ గొడవ పెట్టుకునే రకం కాదని అన్నారు. తమది క్రమశిక్షణ కల్గిన పార్టీ అని వ్యాఖ్యానించిన ఆయన తమ ఇంటి సమస్యను పరిష్కరించుకుంటామని తెలిపారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల వద్దకు తానే వెళతాననీ, అవసరమైతే అందరినీ తన ఇంటికే ఆహ్వానిస్తానని వెల్లడించారు. తమ మధ్య పెద్ద స్థాయిలో సమస్యలు లేవనీ కొందరు కావాలనే పెద్దవి చేసి చూపిస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు.

మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష నిర్ణయాల కారణంగా తమ క్యాడర్ ఇబ్బందులు పడుతున్నారని, అసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్యేలు వాపోయారు. తమ తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను చర్చించి అధిష్టానం దృష్టికి తీసుకురావడానికే సమావేశమైయ్యామని ఆ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై నేడో రేపో కేటిఆర్ మాట్లాడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి  షాక్ .. మల్లారెడ్డి వైఖరిని వ్యతిరేకిస్తూ అసమ్మతి ఎమ్మెల్యేల భేటీ.. కీలక వ్యాఖ్యలు

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju